News


హైదరాబాద్‌ వద్ద ‘యువిక్‌’ మరో ప్లాంటు

Friday 24th January 2020
news_main1579835319.png-31149

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అల్యూమినియం విండోస్‌, డోర్స్‌ తయారీలో ఉన్న యువిక్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ కొత్త ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద ఇది ఎనమిది నెలల్లో రానుంది. 10 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం చేస్తున్నట్టు యువిక్‌ ఎండీ తరుణ్‌ సందీప్‌ తెలిపారు. కంపెనీ ఈడీ చైతన్య బోయపాటి, వైకేకే ఏపీ డైరెక్టర్‌ మిచిషిత, బొరూకా ఎక్స్‌ట్రూషన్‌ డైరెక్టర్‌ రజత్‌ అగర్వాల్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. జపాన్‌కు చెందిన అల్యూమినియం బిల్డింగ్‌ ప్రొడక్ట్స్ తయారీలో ఉన్న ప్రపంచ దిగ్గజం వైకేకే ఏపీతో సాంకేతిక ఒప్పందం చేసుకుని ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్డర్‌ బుక్‌ ప్రస్తుతం రూ.60 కోట్లుందని పేర్కొన్నారు. ఇప్పటికే బొల్లారం వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. కంపెనీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 140 మంది పనిచేస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 500లకు చేరుతుందని చైతన్య బోయపాటి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫ్యాబ్రికేటర్స్‌తో ఒప్పందం చేసుకుని ప్రొఫైల్స్‌ను సరఫరా చేస్తామన్నారు.



You may be interested

కెనరా బ్యాంక్‌కు తగ్గిన మొండి బకాయిలు

Friday 24th January 2020

4 శాతం పెరిగిన నికర లాభం  ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.330 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.318 కోట్లుతో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,513 కోట్ల నుంచి రూ.14,002 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది.

ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది

Friday 24th January 2020

భారత్‌లో పెట్టుబడులకు ఉత్సాహపూరిత వాతావరణం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నట్టు పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో

Most from this category