STOCKS

News


ఆశాజనకంగా అక్టోబర్‌ ఆటో అమ్మకాలు

Saturday 2nd November 2019
news_main1572666824.png-29296

  • 7 నెలల తరువాత పెరిగిన మారుతీ విక్రయాలు
  • పుంజుకుంటున్న మహీంద్ర, టయోటా

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ అమ్మకాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆటో రంగం అక్టోబర్‌ నెల్లో ఆశాజనక వాతావరణాన్ని నమోదుచేసింది. ఈ రంగంలోని దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా వంటి సంస్థలు అమ్మకాల్లో పురోగతిని చూపాయి. దాదాపు 7 నెలల అనంతరం మారుతీ 4.5 శాతం వృద్ధి రేటుతో సానుకూల సంకేతాలను ఇచ్చింది. ప్యాసింజర్‌, వాణిజ్య విక్రయాలు గతంతో పోల్చితే అక్టోబర్‌లో మెరుగ్గా ఉందని ఎం అండ్ ఎం చీఫ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్) విజయ్ రామ్ నక్రా అన్నారు. పండుగల సీజన్‌ అమ్మకాల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించినట్లు టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వెల్లడించారు. నెమ్మదించిన ఆటో రంగంలో ఆశాజనక వాతావరణం అలముకుందని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ వెల్లడించారు.

క్యూ5, క్యూ7 ధరలను తగ్గించిన ఆడీ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’.. తన పాపులర్‌ ఎస్‌యూవీలైన ‘క్యూ5, క్యూ7’ ధరలను తగ్గించింది. గతంలో రూ. 55.8 లక్షలుగా ఉన్న క్యూ5 ధరను రూ. 49.99 లక్షలకు తగ్గించింది. క్యూ7 పెట్రోల్‌ వెర్షన్‌ ధరను రూ. 68.99 లక్షలకు, డీజిల్‌ వెర్షన్‌ ధరను రూ. 71.99 లక్షలకు తగ్గించినట్లు ప్రకటించింది. 



You may be interested

మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి

Saturday 2nd November 2019

లేకపోతే జరిమానాలు, వడ్డీల భారమైనా తగ్గించండి బకాయిల చెల్లింపునకు 2 ఏళ్ల మారటోరియం ఇవ్వండి స్పెక్ట్రం, లైసెన్సు ఫీజులపై కేంద్రానికి సీవోఏఐ మరో లేఖ న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌-ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయీలు (సుమారు రూ. 1.42

యస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.629 కోట్లు

Saturday 2nd November 2019

రూ.8,348 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం  2.7 శాతానికి పడిపోయిన నికర వడ్డీ మార్జిన్‌  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో రూ.629 ‍కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్ల కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయినప్పటి  నుంచి చూస్తే ఇది ఈ బ్యాంక్‌కు రెండో త్రైమాసిక

Most from this category