News


డిసెంబర్‌ వాహన విక్రయాలు: మారుతీ, మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి

Thursday 2nd January 2020
news_main1577935898.png-30602

  • మారుతీ, మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి
  • హ్యుందాయ్‌, టయోటా విక్రయాల్లో క్షీణత

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గతేడాది డిసెంబర్‌లో కాస్త మెరుగుదలను కనబర్చాయి. ఏడాది ప్రారంభం నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చిన ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు.. పండుగల సీజన్‌ నేపథ్యంలో చివరి నెలల్లో గాడిన పడ్డాయి. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో భారీగా క్షీణించినప్పటికీ.. 2019 ఏడాది చివరి నెలల్లో నిలదొక్కుకున్నాయి. డిసెంబర్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా కంపెనీల విక్రయాలు స్వల్ప వృద్ధి రేటును నమోదుచేయడమే ఇందుకు నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో మారుతీ కార్ల విక్రయాలు 17 శాతం తగ్గుదలను నమోదుచేయగా.. గత నెల్లో మాత్రం 2.4 శాతం వృద్ధిని ప్రదర్శించాయి. మహీంద్రా అమ్మకాల్లో ఒక శాతం వృద్ధి నమోదైంది. కొత్త ఏడాదిలో బీఎస్‌-6 వాహనాల విడుదలపై దృష్టిసారించామని, అధునాతన వాహనాల విడుదలతో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం లిమిటెడ్ చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా అన్నారు. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను విడుదలచేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోనున్నామని, ఇన్వెంటరీని తగ్గించే చర్యలను ఇప్పటికే కొనసాగిస్తున్నమని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ వెల్లడించారు. ఇక గతనెల అమ్మకాలు తాము ఆశించిన స్థాయిలోనే ఉన్నట్లు హోండా కార్స్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ అన్నారు. నెమ్మదించిన ఆటో రంగంలో కనీసం గతేడాది చివర్లో అయినా అమ్మకాలు మెరుగుపడడం ఆశాజనకంగా ఉందని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ సర్వీస్) నవీన్ సోని వ్యాఖ్యానించారు. 

 



You may be interested

అసెట్స్‌ విక్రయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌

Thursday 2nd January 2020

రూ. 300 కోట్ల సమీకరణపై కసరత్తు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్‌) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన

ఏటీఎఫ్‌, వంట గ్యాస్‌ ధరలకు రెక్కలు

Thursday 2nd January 2020

(అప్‌డేటెడ్‌...) ఏటీఎఫ్‌ ధరలు 2.6 శాతం పెంపు సబ్సిడీలేని గ్యాస్‌ సిలిండర్‌పై రూ.19 పెంపు న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలతోపాటు, వంటగ్యాస్‌కు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు రేట్లను సవరించాయి. ఫలితంగా ఢిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటర్‌ ధర రూ.1,637 పెరిగి రూ.64,324 అయింది. నెల వ్యవధిలో ఏటీఎఫ్‌ ధరలను పెంచడం రెండోసారి. డిసెంబర్‌ 1న కూడా కిలోలీటర్‌పై రూ.14 వరకు పెరిగింది.

Most from this category