News


ఆటో రంగానికి కరోనా కాటు

Monday 2nd March 2020
news_main1583120030.png-32198

  • 42 శాతం తగ్గిన ఎం అండ్‌ ఎం అమ్మకాలు
  • మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌ విక్రయాలు డౌన్‌

న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్‌ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత నెల్లో 1,36,849 యూనిట్లకు పరిమితమైయ్యాయి. మహీంద్ర అండ్‌ మహీంద్ర (ఎం అండ్‌ ఎం) అమ్మకాలు ఏకంగా 42 శాతం క్షీణించాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనా నుంచి సప్లై తగ్గడం వల్ల ఈ స్థాయి పతనం నమోదైందని సంస్థ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వెల్లడించారు. వైరస్‌ కారణంగానే తమ కంపెనీ ఫిబ్రవరి విక్రయాలు తగ్గాయని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ తెలిపారు.



You may be interested

నేటి నుంచి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Monday 2nd March 2020

ప్రైస్‌బాండ్‌ రూ.750-755 ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు  మార్చి 16న లిస్టింగ్‌  న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ కల్లోలంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఈ ఐపీఓ నేడు (సోమవారం) మొదలై మార్చి 5న ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.750-755గా నిర్ణయించారు. కనీసం 19 షేర్లకు(మార్కెట్‌ లాట్‌) దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల

సెన్సెక్స్‌కు కీలకస్థాయి 37,415

Monday 2nd March 2020

కరోనావైరస్‌ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒకేవారంలో ఎన్నడూ చూడనంత పెద్ద పతనం అంతర్జాతీయ  మార్కెట్లలో సంభవించింది. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌...వడ్డీ రేట్ల కోత, ఇతర ఉద్దీపన చర్యలకు సిద్ధంగా వున్నట్లు గత శుక్రవారం ప్రకటించడంతో  ఆరోజున అమెరికా స్టాక్‌ సూచీలు కనిష్టస్థాయి నుంచి చాలావరకూ కోలుకున్నప్పటికీ, ఈ ఉద్దీపన ప్రకటన ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా  అన్నది అనుమానమే. చైనా

Most from this category