News


ఈ రంగాలు బలహీనం!

Tuesday 9th July 2019
news_main1562667863.png-26930

క్యు1 ఫలితాలపై సిటీ గ్రూప్‌ అంచనాలు
పేలవ ఆటో విక్రయాలు, బలహీన మెటల్‌, ఎనర్జీ కంపెనీల ఫలితాలు.. తొలి త్రైమాసిక ఫలితాలను నీరుగారుస్తాయని సిటీ గ్రూప్‌ అంచనా వేస్తోంది. క్యు1లో బ్యాంకులు మంచి పనితీరు కనబరిచినా, ఆటో, మెటల్స్‌, ఎనర్జీ రంగాలు నిరాశపరుస్తాయని అభిప్రాయపడింది. తాము పర్యవేక్షించే 150 పైచిలుకు కంపెనీల ఉమ్మడి క్యు1 ఫలితాల ఎర్నింగ్స్‌ వృద్ధి గతేడాదితో పోలిస్తే 3 శాతం మాత్రమే అధికంగా ఉండొచ్చని పేర్కొంది. క్యు1లో సెన్సెక్స్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి 24 శాతం, నిఫ్టీ 50 కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి 6 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. ఫైనాన్షియల్‌రంగాల కంపెనీల ఫలితాలను మినహాయిస్తే ఎర్నింగ్స్‌ వృద్ధి 13 శాతం క్షీణిస్తుందని తెలిపింది. ఈ త్రైమాసికంలో పైన పేర్కొన్న మూడు బలహీన రంగాల ఎర్నింగ్స్‌ వృద్ధి 20 శాతం మేర తగ్గుతుందని అంచనా వేసింది. ఈ సారి కంపెనీలు తమ కామెంటరీల్లో ఆశావహ ధృక్పథం వెలువరించేందుకు అవకాశాలు తక్కువని తెలిపింది.

ఆటో రంగంలో డీగ్రోత్‌ కొనసాగుతుందని, స్టీల్‌ సంస్థల వాల్యూంలు మందగించడం, మార్కెటింగ్‌ మార్జిన్లు తగ్గడం కనిపిస్తుందని సంస్థ ఇండియా హెడ్‌ సురేంద్ర గోయల్‌ చెప్పారు. వీటితో పాటు సిమెంట్‌ రంగంలో కూడా ఎర్నింగ్స్‌ కొంతమేర పేలవంగానే ఉంటాయన్నారు. కన్జూమర్‌ రంగంలో వాల్యూంలు బాగున్నా, ఫలితాలు మాత్రం స్తబ్దుగా ఉంటాయన్నారు. క్యు1లో యుటిలిటీలు, ఫార్మా రంగాలు బాగుండొచ్చన్నారు. మిడ్‌క్యాప్స్‌ ఎర్నింగ్స్‌ను మెటల్‌ సెక్టార్‌ కంపెనీల బలహీనత దెబ్బతీయవచ్చని, దీంతోపాటు యస్‌బ్యాంక్‌, యూబీఐ వంటి బ్యాంకుల బలహీన ఫలితాలు సైతం మిడ్‌క్యాప్‌ ఎర్నింగ్స్‌పై నెగిటివ్‌ ప్రభావం చూపుతాయని వివరించారు. 



You may be interested

రోజంతా హెచ్చుతగ్గులు...ఫ్లాట్‌ ముగింపు

Tuesday 9th July 2019

రెండు రోజుల భారీ పతనం అనంతరం మార్కెట్‌ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు అక్కడక్కడే క్లోజయ్యాయి.  సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 38,731 వద్ద, నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 11,556 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆర్థిక, మీడియా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 321 పాయింట్ల

సన్‌ఫార్మా 5శాతం అప్‌

Tuesday 9th July 2019

ఫార్మా షేర్ల ర్యాలీలో భాగంగా మంగళవారం సన్‌ షేర్లు 5.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.370.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమలో 11-13శాతం వృద్థిని నమోదుచేయవచ్చనే ఇక్రా తన వార్షిక నివేదికలో వెల్లడించడంతో నేటి ట్రేడింగ్‌లో ఫార్మా రంగ షేర్లకు ర్యాలీ జరిగింది. అందులో భాగంగా ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఒక

Most from this category