News


రివర్స్‌ గేర్‌లో అటో విక్రయాలు

Wednesday 2nd October 2019
Markets_main1569991419.png-28665

  • సెప్టెంబర్‌లో భారీ క్షీణత
  • సగానికి తగ్గిన దిగ్గజ కంపెనీల అమ్మకాలు
  • టాటా మోటార్స్‌ అమ్మకాల్లో 50 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈసారి భారీ తగ్గుదలను నమోదుచేశాయి. సెప్టెంబర్‌లో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. అమ్మకాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాల్లో దిగ్గజ కంపెనీగా కొనసాగుతోన్న మారుతీ సుజుకీ అమ్మకాలు గతనెల్లో 26.7 శాతం పడిపోయాయి. తాజా అమ్మకాల గణాంకాలపై హ్యుండయ్‌ మోటార్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల సెంటిమెంట్‌ మెరుగుపడకపోవడం వల్ల సెప్టెంబర్‌లో కూడా అమ్మకాలు క్షీణించాయి. ఈ అంశమే తాజా గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది’ అని అన్నారు. దసరా, దీపావళి పండుగల సమయంలో అమ్మకాలు గాడిన పడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎం అండ్‌ ఎం చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి వర్షాలు అనుకున్నస్థాయిని మించి నమోదుకావడం, కార్పొరేట్‌ పన్నుల్లో భారీ కోత విధించి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలను వెల్లడించడం వంటి సానుకూల వాతావరణంలో త్వరలోనే అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారుల విచారణల ఆధారంగా పండుగల సీజన్‌లో అమ్మకాలు గాడిన పడతాయని అంచనావేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ అన్నారు.You may be interested

అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి అంచనాలు భారీగా కుదింపు

Wednesday 2nd October 2019

2019కి 1.2 శాతానికి తగ్గించిన డబ్ల్యూటీవో న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 సంవత్సరానికి 2.6 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో ఈ సంస్థ అంచనా వేయగా, తాజాగా దీన్ని 1.2 శాతానికి కుదించింది. ఇది భారత్‌కు రుచించని విషయమే. ఎందుకంటే ఎగుమతులను పెంచుకునేందుకు మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం గమనార్హం. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న

జీఎస్‌టీ వసూళ్లూ డౌన్‌

Wednesday 2nd October 2019

 సెప్టెంబర్‌లో రూ.91,916 కోట్లు 2018 ఇదే నెల్లో రూ.98,202 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో పెరక్కపోగా క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం రూ.98,202 కోట్ల నుంచి రూ.91,916 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.  2018 సెప్టెంబర్‌తో పోల్చి చూసినా, తాజా సమీక్షా నెల్లో వసూళ్లు తగ్గడం గమనార్హం. అప్పట్లో ఆ మొత్తం రూ.94,442 కోట్లు. అంటే వార్షికంగా

Most from this category