News


ఆదుకోండి మహాప్రభో!!

Thursday 8th August 2019
news_main1565241978.png-27628

  • ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి
  • వాహనాలపై జీఎస్‌టీ తగ్గించండి
  • కేంద్రానికి ఆటోమొబైల్ పరిశ్రమ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ, ఎంఅ౾ండ్‌ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం).. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజన్ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. "ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము. డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను" అని భేటీ అనంతరం రాజన్ వధేరా చెప్పారు. ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. "చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది" అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. 
   దాదాపు ఏడాదికాలంగా ‍అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌-జూన్ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్మడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్‌ఏడీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు..
ఉద్యోగాల్లో కోతలు సహా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల ఈ భేటీలో చర్చకు వచ్చాయి. డిమాండ్ పడిపోవడానికి కారణాలేంటి, పరిష్కార మార్గాలేమిటి అన్నది తెలుసుకోవడంపై కేంద్రం ఆసక్తిగా ఉన్నట్లు వధేరా చెప్పారు. రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్ సామర్థ్యంలో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు ఆయన తెలిపారు. ఆటోమొబైల్ రంగం ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి. అలాగే, అమ్మకాలు మందగించడంతో ఉద్యోగాల్లో కోత పడుతున్న సంగతి కూడా తెలియజేశాయి. 

రుణ లభ్యత పెరిగేలా చూడాలి..
"తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము" అని వధేరా చెప్పారు. అత్యంత తక్కువ మొండిబకాయిలు ఉండే వాహనాల విభాగానికి రుణాలివ్వడాన్ని తగ్గించొద్దని బ్యాంకులను కేంద్రం ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఇక పాతబడిపోయిన, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు. 



You may be interested

ఇండియన్ బ్యాంక్‌తో ఆదిత్య బిర్లా లైఫ్ జట్టు

Thursday 8th August 2019

చెన్నై: ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్‌ కార్పొరేట్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇండియన్ బ్యాంక్ ఎండీ పద్మజ చుండూరు, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్ ఇన్సూరెన్స్ ఎ౾ండీ అజయ్ శ్రీనివాసన్ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌కు చెందిన జీవిత బీమా పథకాలను ఇండియన్ బ్యాంక్ తమ ఖాతాదారులకు

ఎస్‌బీఐ...15 బేసిస్‌ పాయింట్ల కోత

Thursday 8th August 2019

ఆర్‌బీఐ రెపో తగ్గింపు నేపథ్యంలో- బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన రుణ రేటును (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత- ఎంసీఎల్‌ఆర్‌)ను 15 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) వరకూ తగ్గించింది. అన్ని కాలపరిమితలపై 0.15 శాతం రేటు తగ్గినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహన, గృహ, వ్యక్తిగత రుణాలకు ప్రామాణికంగా ఉన్న ఏడాది కాలవ్యవధి రుణ రేటు తాజా

Most from this category