News


ఆటో రంగానికి బీఎస్‌-4 గుదిబండ

Wednesday 11th March 2020
news_main1583901691.png-32402

  • కరోనా వైరస్‌ కారణంగా తగ్గిన వాహన విక్రయాలు
  • మార్చి 31తో ముగియనున్న పాతవాటి రిజిస్ట్రేషన్లు
  • ఈలోపే అమ్మకాలు పూర్తి చేయలేమంటున్న కంపెనీలు
  • ఆటో రంగానికి మరో కొత్త కష్టం

న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్న కారణంగా పాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల చివరినాటికి ముగించేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఇన్వెంటరీలను కలిగి ఉన్న వాహన రంగ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మొన్నటి వరకు పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి వేగంగా ఉన్నందు వల్ల షారూంలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయి అమ్మకాలు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విజృంభిస్తోన్న వైరస్‌ పరంగా చూస్తే.. గడువు తేదీలోపు బీఎస్‌-4 వాహన విక్రయాలను పూర్తి చేయడం కష్టమేనని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. మరోవైపు పాత వాహనాలను రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తికావలని పలు రాష్ట్ర రవాణా విభాగాలు డీలర్లకు సర్క్యూలర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. 

30-రోజులకు పెరిగిన నిల్వలు
పేరుకుపోయిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్‌ కాలే అన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల వద్ద అన్ని విభాగాలకు చెందిన పాత వాహనాల నిల్వలు అధిక స్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర నిల్వలు అధికంగా ఉన్నాయని వివరించారు. వీటి ఇన్వెంటరీ 20-30 రోజులుగా ఉందన్నారు. ఓఈఎం (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌)తో కలిసి సంప్రదింపులు నిర్వహించనున్నామని, ఇందుకు తగిన పరిష్కార మార్గం దొరక్కపోతే డీలర్లు భారీ స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వివరించారు. 



You may be interested

రూ.44,500పైన పసిడి!

Wednesday 11th March 2020

కోవిడ్‌-19 ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించడానికి ప్రపంచ దేశాలు విధానపరమైన చర్యలు చేపడుతుండడంతో కొంత మంది పెట్టుబడిదారుల్లో ఆందోళనలు తగ్గడంతో బుధవారం బంగారం ధర స్వల్పంగా బలపడింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో మొన్నటి ముగింపుతో  పోలిస్తే రూ.65 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.43,801.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో సైతం 2 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,663.50 వద్ద

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 11th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు అదానీ పోర్ట్స్‌: అప్పుల్లో కూరుకుపోయిన డిగ్గీ పోర్ట్‌ కొనుగోలుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ రూ.650 కోట్ల ప్లాన్‌ను ప్రతిపాదించగా ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  ఇన్ఫోసిస్‌: అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వాటర్‌ లైన్‌ డేటా సైన్స్‌లో పెట్టిన 4.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వదులుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కాగా ఈ మొత్తాన్ని 2016,2018 సంవత్సరాలలో రెండు దశల్లో

Most from this category