News


అధిక ఉత్పత్తే అసలు సమస్య...

Wednesday 11th September 2019
news_main1568186191.png-28306

ఆటో రంగ సంక్షోభంపై రాజీవ్‌ బజాజ్‌
దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం‘‘అధిక ఉత్పత్తి మరియు అధికంగా స్టాకులు పేరకపోవడం’’ అని బజాజ్‌ ఆటో ఎండీ రాహుల్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంఓ ఆటోమొబైల్‌ రంగంపై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కోత విషయమై నిర్ణయం ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీ భారత్‌6 నిబంధనలకు అనుగుణంగా మార్పు చెందుతోందని, నవంబర్‌ నాటికి పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేశారు. కరెక‌్షన్‌ లేకుండా ముందుకే సాగిపోయే పరిశ్రమ ఏదీ ఉండదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీలన్నీ దాదాపు అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు జరుపుతున్నందున, ఏదో ఒక దేశంలో మందగమనం మొత్తం కంపెనీపై ప్రభావం చూపే స్థితిలేదన్నారు. ఆటో విక్రయాల క్షీణతో కేవలం 5- 7 శాతం మాత్రమే మందగమన ప్రభావంతో తగ్గిఉంటాయన్నారు. ప్రతి పరిశ్రమకు ఉత్థానపతనాలు ఉంటాయని, సైకిల్స్‌ మారేందుకు సమయం పడుతుంటుందని వివరించారు. ఇప్పటి సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరని, కానీ ఇప్పటికైతే జీఎస్‌టీ కోతల అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 
స్వీయతప్పిదమే..
నిజానికి ఆటో రంగంలో ఈ పరిస్థితికి కంపెనీలే ప్రధానకారణమని రాహుల్‌ విమర్శించారు. కంపెనీలు వృద్ధి అంచనాలు విపరీతంగా వేసుకొని అధిక ఉత్పత్తులు చేశాయన్నారు. లాజిక్‌ లేకుండా కంపెనీలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ సంక్షోభమని దుయ్యబట్టారు. తాము ఈ చట్రంలో ఇరుక్కుపోలేదని, తమ సామర్ధ్యం పూర్తిగా ఉపయోగంలోకి వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాతే తాము సామర్ధ్య విస్తరణ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం జీఎస్‌టీ వెసులుబాటులు కల్పించదలిస్తే బీఎస్‌6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు పరిమితం చేయాలని సూచించారు. జీఎస్‌టీ తగ్గింపు డీలర్ల సొమ్ము బ్లాక్‌ అయ్యేందుకు కారణమవుతుందని, అందువల్ల కోత అనవసరమని రాహుల్‌ విశ్లేషించారు. ఎందుకంటే జీఎస్‌టీ కోత విధిస్తే అప్పటికే పాత రేటు ప్రకారం కంపెనీకి డీలర్లు సొమ్ము చెల్లించాల్సిఉంటుందని, మరోపక్క కస్టమర్లకు కొత్తగా తగ్గించిన రేటుకు అందించాల్సి ఉంటుందని, అందువల్ల రెండు రకాలుగా డీలర్లకు నష్టం వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితి రాకుండా జీఎస్‌టీ కోతకు పరిమితి ఉంచాలని చెప్పారు. 



You may be interested

టాప్‌గేర్‌లో టాటా మోటార్స్‌

Wednesday 11th September 2019

కలిసొచ్చిన చైనా ఆగస్ట్‌ అమ్మకాల రికవరి టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ 4రోజూ కొనసాగుతుంది. బీఎస్‌ఈలో బుధవారం మరో 8శాతం లాభపడ్డాయి. చైనాలో ఆగస్ట్‌ రిటైల్‌ అమ్మకాలు పెరగడం షేర్ల ర్యాలీకి కారణమవుతోంది. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.124.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సోమవారం సాయంత్రం ఆగస్ట్‌ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేసింది. అమ్మకాలు యూరప్‌, అమెరికాలో తగ్గినప్పటికీ.,

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం అప్‌

Wednesday 11th September 2019

యస్‌ బ్యాంక్‌, యస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,639.05 వద్ద ప్రారంభమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన యస్‌బ్యాంక్‌ లో కొంత వాటాను పేటిఎం సంస్థ కొనుగోలు చేస్తుందనే వార్తలతో యస్‌బ్యాంక్‌ షేర్లు నేడు 15శాతం ర్యాలీ చేయడంతో

Most from this category