News


అరబిందో లాభం రూ.705 కోట్లు

Friday 7th February 2020
news_main1581044512.png-31579

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1 శాతం తగ్గి రూ.705 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.5,270 కోట్ల నుంచి రూ.5,895 కోట్లకు ఎగసింది. యూఎస్‌ ఫార్ములేషన్స్‌ ఆదాయం 22 శాతం పెరిగి రూ.2,969 కోట్లకు చేరింది. యూరప్‌ ఫార్ములేషన్స్‌ 14.2 శాతం వృద్ధితో రూ.1,476 కోట్ల ఆదాయం సాధించింది. ఎబిటా 20.5 శాతంగా ఉంది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండు రూ.1.75 చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు సమ్మతించింది. 



You may be interested

11 శాతం తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

Friday 7th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.2 శాతం తగ్గి రూ.1,394 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.3,786 కోట్ల నుంచి రూ.3,136 కోట్లకు వచ్చి చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.5.29 మధ్యంతర డివిడెండు చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. 

ఆధార్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పాన్‌ కార్డ్‌!

Friday 7th February 2020

రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడి న్యూఢిల్లీ: పాన్‌ కార్డ్‌ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా సత్వరమే పాన్‌ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వైబ్‌ సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే నమోదిత మొబైల్‌కు వన్‌ టైం పాస్‌ వార్డ్‌ (ఓటీసీ) వస్తుందని, దీనిని

Most from this category