News


మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో

Monday 25th November 2019
news_main1574652873.png-29823

హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్‌ డీల్‌తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్‌ కంపెనీ అయిన సాండోజ్‌ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబరులో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050-1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్‌ తెలిపారు. గత మూడు త్రైమాసిక ఫలితాలనుబట్టి మూడేళ్లలో రుణ రహిత కంపెనీ అవుతుందని చెప్పారు. 2019 జూన్‌తో పోలిస్తే సెప్టెంబరు నాటికి సంస్థ నికర రుణాలు రూ.497 కోట్లు తగ్గి రూ.3,654 కోట్లకు వచ్చి చేరాయి. 



You may be interested

ఒకటా, రెండా, ఎన్ని డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ?

Monday 25th November 2019

ధీరేంద్ర కుమార్‌ సీఈవో వాల్యూ రీసెర్చ్‌  ప్ర: నేను గత కొంత కాలంగా కెనర రొబెకో  ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇది మంచి ఫండేనా ? నేను 15-20 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇన్నేళ్లు ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? -కిన్నెర, విశాఖపట్టణం  జ: కెనర రొబెకొ ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ ఫండ్‌... గత కొంత కాలంగా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఈ

అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ

Monday 25th November 2019

న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) డైరెక్టర్‌గా అనిల్ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్‌ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్‌కామ్‌ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార

Most from this category