అధ్వాన్నంగా ఆగస్టులో ఆటో అమ్మకాలు
By Sakshi

- అన్ని విభాగాల్లోనూ క్షీణతే న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్ 1997-98 నుంచి ఆటో అమ్మకాల డేటాను రికార్డు చేస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయి పతనం నమోదుకాలేదు. ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), వాణిజ్య వాహనాలు (సీవీ), ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు 23.55 శాతం తగ్గాయి. గతనెల విక్రయాలు 18,21,490 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 23,82,436 యూనిట్లు. వరుసగా 10వ నెల్లోనూ పీవీ సేల్స్ డౌన్... - మారుతి అమ్మకాల్లో 36.14 శాతం క్షీణత... - ద్విచక్ర వాహనాల సేల్స్ 22 శాతం డౌన్...
- 1997-98 తరువాత అత్యంత తక్కువ సేల్స్
ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 31.57 శాతం క్షీణతను నమోదుచేశాయి. గతనెల అమ్మకాలు 1,96,524 యూనిట్లు కాగా, 2018 ఆగస్టు విక్రయాలు 2,87,198 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక జూలైలో 30.98 శాతం తగ్గుదలను నమోదుచేసిన విషయం తెలిసిందే కాగా.. వరుసగా 10 నెలల నుంచి పీవీ అమ్మకాలు తగ్గుదలను నమోదుచేస్తూనే ఉన్నాయి.
పీవీ విక్రయాల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకీ ఆగస్టు నెల అమ్మకాల్లో 36.14 శాతం క్షీణతను నమోదుచేసింది. గతనెల విక్రయాలు 93,173 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు 31.58 శాతం, హ్యుందాయ్ సేల్స్ 16.58 శాతం తగ్గాయి.
ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.24 శాతం తగ్గాయి. గతనెల విక్రయాలు 15,14,196 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 19,47,304 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఈ విభాగంలో హీరో మోటోకార్ప్ 20.97 శాతం, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 26.26 శాతం, టీవీఎస్ 20.37 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. మరోవైపు వాణిజ్య వాహన విక్రయాలు గతనెల్లో 38.71 శాతం తగ్గాయి.
You may be interested
మిశ్రమంగా ఆసియా మార్కెట్లు
Tuesday 10th September 2019చైనా ఫ్యాక్టరీ గేట్ ధరలు (ఉత్పత్తులకు ఫ్యాక్టరీ నిర్ణయించే ధరలు) మూడేళ్ల కనిష్టానికి పతనం కావడంతో మంగళవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నికాయ్, స్ట్రైట్స్ టైమ్స్, కోప్పీ, హాంగ్‌సెంగ్ సూచీలు అరశాతం వరకు లాభపడగా, తైవాన్ వెయిటైడ్, సెట్కాంపోజిట్, జకర్తా కాంపోజిట్, షాంఘై కాంపోజిట్ సూచీలు అరశాతం నష్టపోయాయి. దేశ, విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో కొన్ని వ్యాపారాల్లో ధరలను తగ్గించిన కారణంగా ఆగస్ట్‌లో వార్షిక ప్రాతిపదికన
మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో 4 శాతం పెరుగుదల
Tuesday 10th September 2019న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోల్చితే 4 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ, లిక్విడ్ స్కీమ్‌లలో పెట్టుబడుల వరద పెరిగిన కారణంగా ఈమేరకు వృద్ధి పెరిగిందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వివరించింది. గతనెల్లో రూ.1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ మొత్తంలో లిక్విడ్ ఫండ్స్ వాటా రూ.79,000 కోట్లు కాగా, ఓపెన్-ఎండ్ ఈక్విటీ