News


ఏటీఎం ఛార్జీలు పెరుగుతాయా..?

Saturday 15th February 2020
news_main1581763396.png-31828

దానికింత దీనికింత అంటూ ఏదోఒక పేరుమీద ఛార్జీలు వసూలుచేస్తూ.. బ్యాంకులు ఖాతాదారుల జేబులు ఖాళీచేస్తున్నాయి. త్వరలో ఏటీఎంలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. నిర్ణీత ఉచిత లావాదేవీల తర్వాత ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలంటే ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే మరికొంత అదనంగా చెల్లించాల్సిందే. ఎందుకంటే ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందిస్తే ఏటీఎం ఛార్జిలు పెరిగే అవకాశం ఉంది. ఒక బ్యాంక్‌ ఏటీఎం కార్డును ఏటీఎంలో వినియోగించినప్పుడు సదరు ఏటీఎం ఆపరేటర్‌కు బ్యాంకు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఖాతాదారుకు ఐదు సార్లు ఉచితంగా అందిస్తూ ఆ పైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నాయి. పరిమితి దాటిన తర్వాత చేసే విత్‌డ్రాపై రూ.15, బ్యాలెన్స్‌ ఎంక్వైరీకి రూ.5 చొప్పున ఛార్జిలు ఉన్నాయి. ఈ ఛార్జీలను ఇంకా పెంచాలని కోరుతూ ఏటీఎంల ఆపరేట్ల అసోసియేషన్‌ ఆర్బీఐకి ఈ నెల 13న లేఖ రాసింది.ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు బాగా పెరిగిందని, దీనివల్ల ఏటీఎంల నిర్వహణ భారంగా మారిందని ఆపరేటర్ల అసోసియేషన్‌ లేఖలో పేర్కొంది. కొత్తగా ఏటీఎంలను ఏర్పాటు చేయాలన్నా ఇబ్బందిగా ఉందని అసోసియేషన్‌ వివరించింది. అయితే 2019లోనే ఆర్బీఐ ఏటీఎంల వినియోగాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ డిసెంబరులో తమ ప్రతిపాదనలను రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పించింది. అందులో ప్రధానంగా ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాలో ఏటీఎం విత్‌డ్రా ఇంటర్‌ఛేంజ్‌ పీజును రూ.17గాను, బ్యాలెన్స్‌ చెక్‌ చేస్తే రూ.7గా పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేగాక ఇప్పటివరకు ఇస్తున్న 5 ఉచిత లావాదేవీలను మూడుకు పరిమితం చేయాలని చెప్పింది. ఇక గ్రామీణ, సెమీఅర్బన్‌ ప్రాంతాల్లో ఈ ఫీజులను రూ.18, రూ.8లకు పెంచి, ఉచితంగా అందించే లావాదేవీలకు ఆరుకు పెంచాలని సూచించింది. ఈ కమిటీ సూచనలను ఆర్బీఐ అమలు పరిస్తే ఏటీఎం విత్‌డ్రాలపై ఛార్జీలు భారం అధికంగా పడుతుంది. కాగా ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 227,000 ఏటీఎంలు ఉన్నాయి. దీనిలో 21,300 వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు కాగా మిగతావి ఆయా బ్యాంకుల ఆధీనంలో ఉన్నాయి.


 



You may be interested

2 వారాలకు రెండు సిఫార్సులు

Saturday 15th February 2020

 ఈ వారంలో ఫిబ్రవరి 10న నిఫ్టీ ఇండెక్స్‌ డౌన్‌సైడ్‌ ట్రెండ్‌లో 12వేల స్థాయిని పరీక్షించింది. బుధవారం సెషన్‌లో మరింత అమ్మకాల ఒత్తిడిని చూసింది. ఐనప్పటికీ.., నిఫ్టీ ఇండెక్స్‌ ఈ వారంలో 0.63శాతం పెరగ్గా, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మాత్రం 0.09శాతం నష్టాన్ని చవిచూసింది. . ఈ నేపథ్యంలో  ఇండియానివేశ్‌ సెక్యూరీటీస్ సీనియర్‌ టెక్నికల్‌ విశ్లేషకుడు మోహుల్‌ కొఠారి సిఫార్సు రాబోయే 2-3 వారాలకు కింది సిఫార్సులను సూచిస్తున్నారు.  షేరు పేరు: ఓఎన్‌జీసీ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌: రూ.116  స్టాప్‌లాస్‌: రూ.98 అప్‌సైడ్‌:

ఈ షేరు మూడు రోజుల్లో 29 శాతం అప్‌..ఎందుకంటే!

Saturday 15th February 2020

వారాంతాన సరికొత్త గరిష్టానికి షేరు ఈ ఏడాది క్యూ3లో పటిష్ట ఫలితాలు షేర్ల ముఖవిలువ విభజన బాట షేరుకి రూ. 13.5 డివిడెండ్‌ కొద్ది రోజులుగా జోరుగా పరుగెడుతున్న ర్వైల్వే రంగ మౌలిక సదుపాయాల పీఎస్‌యూ.. ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ షేరు వారాంతాన సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 573కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఆపై 4.5 శాతం లాభంతో రూ. 551 వద్ద ముగిసింది. ఇటీవల

Most from this category