News


ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

Tuesday 27th August 2019
news_main1566878118.png-28034

  • ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

ఏటీఎంల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్‌ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్‌ డ్రాయల్స్‌ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్‌ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్‌ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కెనరా బ్యాంకు మరో అడుగు ముందుకేసి కార్డు దారుల ప్రమేయంతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఓటీపీ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం మరింత భద్రతను తీసుకొచ్చేదే అవుతుంది. 



You may be interested

డిజిటల్ మీడియాలో విదేశీ పెట్టుబడులు

Tuesday 27th August 2019

బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగ నిబంధనల సడలింపు 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు మరో విడత సంస్కరణలపై కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ మీడియాతో పాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పూర్తి స్థాయిలో అనుమతించే దిశగా మరో విడత సంస్కరణలపై కసరత్తు చేస్తోంది. వీటిలో భాగంగా బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగానికి సంబంధించి కూడా ఎఫ్‌డీఐ నిబంధనలను

కృష్ణపట్నంలో బీపీసీఎల్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌

Tuesday 27th August 2019

రూ.1,500-1,700 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ: ఆయిల్‌ రిఫైనింగ్‌, ఫ్యూయెల్‌ మార్కెటింగ్‌ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జీ ఇంపోర్ట్‌ టెర్మినల్‌ను నిర్మించనుంది. 2022 నాటికి ఇది పూర్తి కానుంది. దీనికోసం రూ.1,500-1,700 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు బీపీసీఎల్‌ చైర్మన్‌ డి.రాజ్‌కుమార్‌ వెల్లడించారు. ప్రాజెక్టులో బీపీసీఎల్‌కు 74 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీకి 26 శాతం వాటా ఉంటుందని చెప్పారు. తొలుత ఈ ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ రీగ్యాసిఫికేషన్‌

Most from this category