News


మార్కెట్లోకి ‘అథర్‌ 450ఎక్స్‌’ ఈ-స్కూటర్‌

Wednesday 29th January 2020
news_main1580276069.png-31294

  • ధరల శ్రేణి రూ. 99,000 – 1,59,000 
  • 3.3 సెకన్లలో 40 కి.మీ వేగానికి

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌కు చెందిన ‘అథర్‌ ఎనర్జీ’.. మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అథర్‌ 450ఎక్స్‌’ పేరిట విడుదలైన ఈ-స్కూటర్‌.. 6 కిలోవాట్ మోటార్‌, కొత్త 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. కంపెనీకి చెందిన మునుపటి మోడల్‌ 450కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా విడుదలైన కొత్త ఈ స్కూటర్‌ 3.3 సెకన్లలోనే సున్నా నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఒక్క సారి చార్జ్‌ చేస్తే నగరాల్లో అయితే 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. 4జీ సిమ్ కార్డ్, వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఫోన్ కాల్స్‌కు అనువుగా ఉండే టచ్ స్క్రీన్ డాష్‌బోర్డ్‌ ఉన్నాయి. మ్యాప్ నావిగేషన్, ఆన్-బోర్డు డయాగ్నస్టిక్స్ వంటి సౌకర్యాలను అందించడం కోసం ఈ స్క్రీన్‌ స్నాప్‌డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని కంపెనీ వివరించింది.
ప్రారంభ రూ. 99,000
ఈ-స్కూటర్‌లో రెండు వేరియంట్లు ఉండగా.. నెలవారీ సభ్యత్వ ప్యాక్‌లతో కొంటే ప్రారంభ ధర రూ. 99,000గా (ఎక్స్‌-షోరూం, ఢిల్లీ) ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్లస్‌ పేరిట అందుబాటులోకి వచ్చిన వేరియంట్‌ చందాదారు ప్యాక్‌ నెలకు రూ.1,699 కాగా, ప్రో వేరియంట్‌ ప్యాక్‌ రూ.1,999గా వివరించింది. సభ్యత్వ ప్యాక్‌ లేకుండా, ప్లస్‌ ధర రూ.1.49 లక్షలు.. ప్రో ధర రూ.1.59 లక్షలు. ఇక బజాజ్‌ ఆటో ఇటీవలే విడుదల చేసిన చేతక్‌ ఎలక్ట్రిక్‌ ధర రూ.1.15 లక్షలు కాగా, టీవీఎస్‌ కంపెనీ తొలి ఈ-స్కూటర్‌ ఐక్యూబ్‌ ధర కూడా 1.15 లక్షలే. 
జూలై నుంచి హైదరాబాద్‌లో స్కూటర్‌
బెంగళూరుకు చెందిన అథర్‌ ఎనర్జీ ప్రస్తుతం చెన్నై, బెంగళూరుల్లోనే ఈ స్కూటర్‌ విక్రయాలను కొనసాగిస్తోంది. ఈ ఏడాది జూన్‌ నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, పూనే నగరాల్లో కూడా విక్రయాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 



You may be interested

మణప్పురం ఫైనాన్స్‌ లాభం 63 శాతం అప్‌

Wednesday 29th January 2020

రూ.398 కోట్లకు పెరిగిన నికర లాభం  స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు  ముంబై: బంగారం తాకట్టు రుణాలిచ్చే మణప్పురం ఫైనాన్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 63 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.244 కోటుల్గా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.398 కోట్లకు పెరిగిందని మణప్పురం ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,399 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ

హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌

Wednesday 29th January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఐటీ రంగ కంపెనీ టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌లో గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల డిజిటల్‌ ట్రాన్స్ఫ్‌ర్మేషన్‌ను వేగవంతం చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్‌ ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా అనలిటిక్స్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా ఉపకరిస్తుందని  టెక్‌ మహీంద్రా క్లౌడ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌ వివేక్‌

Most from this category