News


ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా చక్రవర్తి

Wednesday 31st July 2019
news_main1564555317.png-27438

ముంబై: ఆర్థిక వ్యవహారాల ‍కార్యదర్శి అతాను చక్రవర్తి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయ్యారు. ఆర్‌బీఐ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 29 నుంచీ అమల్లోకి వచ్చే ఈ నియామకం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ అమల్లో ఉంటుంది.  సుభాష్‌ చంద్ర గార్గ్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. గార్గ్‌ ఈ నెల 25న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి బాధ్యతల నుంచి విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బదిలీ అయిన వెంటనే ఆయన ​‍‘‘అక్టోబర్‌ 31 నుంచీ అమల్లోకి వచ్చేలా ఐఏఎస్‌కు వీఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్నాను’’ అని చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. అయితే ఇది తాజా నిర్ణయం కాదని, జూలై 18వ తేదీనే ఈ అంశంపై ప్రధాని కార్యాలయంతో తన వీఆర్‌ఎస్‌పై చర్చించడం జరిగిందనీ పేర్కొంటూ చర్చనీయాంశానికి గార్గ్‌ ముగింపు పలికారు. 



You may be interested

కొత్త ఫైనాన్స్‌ సెక్రటరీగా రాజీవ్‌ కుమార్‌

Wednesday 31st July 2019

న్యూఢిల్లీ: ఆర్థిక సేవల కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్‌ కుమార్‌ మంగళవారం కొత్త ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఈ నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. కుమార్‌ 1984 జార్ఖండ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కుమార్‌కు బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు, మూలధన కల్పన వంటి అంశాల్లో అపార అనుభవం ఉంది.  సుభాష్‌ చంద్ర గార్గ్‌ను

పుస్తక విలువ దిగువకు 105 స్టాకులు

Wednesday 31st July 2019

గత కొన్ని నెలల నుంచి స్టాక్‌ మార్కెట్లు దిద్దుబాట్లకు గురువుతున్నాయి. ఫలితంగా చాలా వరకు కంపెనీల స్టాక్స్‌ వాల్యుషన్‌ ​ తమ పుస్తక విలువ కంటే దిగువకు పడిపోయాయి. మిడ్ క్యాప్ కంపెనీలైన హెచ్‌ఈజీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, హిమాటింగ్‌కా సీడ్, అపోలో టైర్స్, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఎన్‌సిసి, బిర్లా కార్ప్, ఇండియా సిమెంట్స్, ట్రైడెంట్, జెకె టైర్ తదితర కంపెనీల షేర్లు ప్రస్తుతం వాటి పుస్తక విలువ కంటే తక్కువగా ట్రేడవుతన్నాయి. బీఎస్‌ఈ

Most from this category