News


దివీస్‌ సీఎండీ వేతనం రూ.58.8 కోట్లు

Monday 12th August 2019
news_main1565590526.png-27708

హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ రంగంలో అత్యధికంగా రూ.58.8 కోట్ల వేతనం అందుకున్న వ్యక్తిగా దివీస్‌ ల్యాబొరేటరీస్‌ సీఎండీ మురళి కె దివి నిలిచారు. ఇదే కంపెనీకి చెందిన ఈడీ ఎన్వీ రమణ రూ.30 కోట్లు, హోల్‌ టైం డైరెక్టర్‌ కిరణ్‌ ఎస్‌ దివి రూ.20 కోట్లు వేతనం పొందారు. సిప్లా ఎండీ ఉమాంగ్‌ వోరా రూ.15.03 కోట్లు, అరబిందో ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ రూ.14.6 కోట్లు, డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ రూ.12.4 కోట్లు వేతనం అందుకున్నారు. దేశంలో అతిపెద్ద ఫార్మా సంస్థ సన్‌ ఫార్మా ఫౌండర్‌ దిలీప్‌ సంఘ్వి రూ.1 వేతనంతోపాటు రూ.2,62,800లు ప్రోత్సాహకాల కింద స్వీకరించారు.



You may be interested

ఈ రెండు షేర్లను కొనొచ్చు

Monday 12th August 2019

మారుతీ సుజుకీ    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.6,101 టార్గెట్‌ ధర: రూ. 6,950 ఎందుకంటే:-  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమ్మకాలు సాధారణ స్థాయికి వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీని కోసం ఉత్పత్తి సామర్థ్యం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పెంపు కోసం సేల్స్‌, సర్వీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేస్తోంది. విద్యుత్‌ వాహనాలు, హైబ్రిడ్‌ వాహనాల కోసం టెక్నాలజీ నిమిత్తం టయోటా కంపెనీతో మారుతీ సుజుకీ కుదుర్చుకున్న ఒప్పందం సానుకూల ప్రభావం

కాంట్రాక్టు తయారీలో 100% ఎఫ్‌డీఐలు

Monday 12th August 2019

విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం ప్రతిపాదన న్యూఢిల్లీ: కాంట్రాక్ట్ తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తయారీ రంగంలో  ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. భారత్‌లో తయారైన ఉత్పత్తులను హోల్‌సేల్‌, రిటైల్ మార్గాల్లో ప్రభుత్వ అనుమతుల అవసరం లేకుండా

Most from this category