News


మెరవని ఏషియన్‌ పెయింట్స్‌

Friday 10th May 2019
news_main1557471072.png-25652

  • ఒక్కో షేర్‌కు రూ.7.65 తుది డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ఏషియన్‌ పెయింట్స్‌  గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసికంలో రూ.487 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.496 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.4,532 కోట్ల​ నుంచి 12 శాతం వృద్ధితో రూ.5,075 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.3,753 కోట్ల నుంచి 16 శాతం పెరిగి రూ.4,341 కోట్లకు చేరాయని వివరించింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.65 తుది డివిడెండ్‌ను చెల్లించనున్నది. గతంలో ఒక్కో షేర్‌కు రూ.2.85 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, దీనిని కూడా కలుపుకుంటే గత ఆర్థిక సంవత్సరం మొత్తం డివిడెండ్‌ ఒక్కో షేర్‌కు రూ.10.50 అవుతుందని వివరించింది. 

ఏడాది ఆదాయం రూ.19,577 కోట్లు ...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,098 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,212 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.17,483 కోట్ల నుంచి రూ.19,577 కోట్లకు పెరిగిందని వివరించింది. You may be interested

మూడేళ్లలో ఇతర విత్తనాలదే మెజారిటీ!

Friday 10th May 2019

పత్తి విత్తనాల వాటా 40 శాతానికి తగ్గుతుంది వరి, కూరగాయల సీడ్స్‌పై దృష్టి పెడుతున్నాం ఏటా 15-20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం సరైన అవకాశం వస్తేనే విలీనాలు, టేకోవర్లు కావేరీ సీడ్స్‌ సీఎండీ వి.భాస్కరరావు సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి: దేశంలో పత్తి పంట సంతృప్త స్థాయికి చేరుకుంటోందని, అందుకే తాము పత్తితో పాటు ఇతర విత్తనాల ఉత్పత్తిని విస్తరించేలా ప్రణాళికలు వేసుకుంటున్నామని హైదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్న విత్తన తయారీ దిగ్గజం కావేరీ సీడ్‌ కంపెనీ లిమిటెడ్‌

హెచ్‌సీఎట్‌ టెక్‌ లాభం రూ.2,550 కోట్లు

Friday 10th May 2019

-ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ -ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల ఆదాయం లక్ష్యం  -హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో

Most from this category