News


ఆసియా రిచెస్ట్‌ మ్యాన్‌ హోదా కోల్పోయిన ముకేశ్అం‌బానీ!

Tuesday 10th March 2020
news_main1583823926.png-32388

ఆయిల్‌, రిటైల్‌, టెలికంలతో పాటు వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. రెండోస్థానంలో ఉన్న అలీబాబా గ్రూపు అధినేత జాక్‌ మా మొదటిస్థానంలోకి వచ్చారు. కరోనా వైర స్‌(కోవిడ్‌-19) ధాటికీ ప్రపంచ దేశాల మార్కెట్లు కూప్పకూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,942 పాయింట్లు కుప్పకూలింది. ఇది చరిత్రలోనే పాయింట్ల రీత్యా అత్యంత భారీ పతనంగా నమోదవడంతో బిలియనీయర్ల సంపద ఆవిరైపోయింది.  కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తుండడం, సౌదీ అరేబియా, రష్యాల మధ్య ముడి చమురు ధరల పోరు తోడవడంతో ఎన్నడూ లేనంతగా మార్కెట్లు క్షీణిస్తున్నాయి. దీంతో రిలయన్స్‌ అధినేత షేర్లు పడిపోవడంతో 5.8 బిలియన్‌డాలర్ల సంపదను కోల్పోయిన ఆయన ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో  రెండోస్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం 2018 బ్లూమ్‌బర్గ్‌ మిడ్‌ ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో రెండోస్థానానికి చేరుకోగా, రెండోస్థానంలో ఉన్న అలీబాబా వ్యవస్థాపకులు, అలీబాబా గ్రూపు అధినేత జాక్‌ మా మొదటిస్థానంలోకి వచ్చారు. అంబానీ కంటే  2.6 బిలియన్‌ డాలర్ల ఎక్కువ సంపద 44.5 బిలియన్‌ డాలర్లతో జాక్‌ మా మొదటి స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్‌  బిలీనియర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. అయితే ముఖేశ్‌ అంబానీ సంపద 41.9 బిలయన్‌డార్లకు పడిపోయిందని బ్లూమ్‌ బర్గ్‌ తెలిపింది. కరోనా వైరస్‌ ప్రభావంతో అలీబాబా వ్యాపారంలో కూడా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీసులు, మొబైల్‌ యాప్స్‌ వంటి వ్యాపారాలు కొంతమేర తగ్గాయి. కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కుచెందిన వివిధ షేర్లు 2019 తర్వాత సోమవారం 12 శాతం పడిపోయాయి. వీటితోపాటు సోమవారం ఎస్‌అండ్‌పి 500 ఇండెక్స్‌, డౌజోన్స్‌ ఇండస్ట్రియల్‌ సగటు7.5 శాతం పడిపోయింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఈ స్థాయిలో పాయింట్ల రీత్యా మార్కెట్లు పడిపోవడం ఇదే మొదటిసారి. మార్కెట్ల పతనంతో సంపన్నుల సంపద నిమిషాల్లో ఆవిరైపోయింది. కాగా 2018లో డాలర్‌ మారకంలో రిలయన్స్‌ మార్కెట్‌ వ్యాల్యూ 133 బిలియన్‌ డాలర్లకు చేరడం, రిలయన్స్‌ షేరు వ్యాల్యూ 35 శాతానికిపైగా లాభపడడంతో బ్రిటిషన్‌ ఎనర్జీ దిగ్గజం బీపీని దాటేసి, టాప్‌ 6 క్లబ్‌ ఆయిల్‌ సూపర్‌ మేజర్స్‌ కంపెనీల్లో ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఒక్కటిగా నిలిచింది. కంపెనీ నికర రుణాన్ని 18 నెలల్లో సున్నాకు తగ్గించే ప్రణాళికను ముఖేష్‌ అంబానీ 2019లో ఆగస్టులో  ప్రకటించిన తర్వాత రిలయన్స్‌ షేరు విలువ... బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ కంటే మూడు రెట్లు పెరిగింది. తాజాగా మర్కెట్‌  మహా పతనం కారణంగా  రిలయన్స్‌ షేరు 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.లక్ష కోట్ల వరకూ ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్‌ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రిలయన్స్‌ రెండో స్థానానికి పడిపోయింది. You may be interested

విలువలు ఆకర్షణీయం...టాప్‌-10 స్టాక్ సిఫార్సులు ఇవే..!

Tuesday 10th March 2020

కరోనా భయాలు, క్రూడాయిల్‌ పతనంతో  హోలీ ముందు రోజు దలాల్‌ స్ట్రీల్‌ ఎరుపు రంగుతో పోటెత్తింది. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు చరిత్రలోనే అతిపెద్ద నష్టాలను చవిచూశాయి. సుమారు రూ.7లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్‌ మహాపతనంతో దలాల్‌ స్ట్రీట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. ఇదే తరుణంలో వాల్యూయేషన్ల్లు ఆకర్షణీయంగా మారడంతో ధీర్ఘకాలిక దృష్ట్యా పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి మార్కెట్‌ పతనంలో భాగంగా

యస్‌ బ్యాంక్‌ బాండ్ల రద్దు- ఫండ్స్‌కు షాక్‌

Tuesday 10th March 2020

పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ఇలా రూ. 8,700 కోట్ల AT 1 బాండ్ల రద్దు నష్టపోనున్న జాబితాలో.. ఆర్‌ఐఎల్, ఎల్‌అండ్‌టీ బార్‌క్లేస్‌, బజాజ్‌ అలయెంజ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టనున్న పునర్వ్యవస్థీకరణ చర్యలలో భాగంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యస్‌ బ్యాంక్‌ జారీ చేసిన AT 1 బాండ్లు రద్దుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో పలు మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు)తోపాటు.. పెన్షన్‌ ఫండ్స్‌, కార్పొరేట్స్‌ సైతం నష్టపోయే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. యస్‌ బ్యాంక్‌ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా వివరాల ప్రకారం నిప్పన్‌, కొటక్‌,

Most from this category