News


భారీ ఆర్డర్లను దక్కించుకున్న అశోక్‌ లేలాండ్‌

Monday 10th February 2020
news_main1581330162.png-31663

  • బ్రిటన్‌ నుంచి 37 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల ఆర్డర్ల రాక

అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి చెందిన బ్రిటన్‌ అనుబంధ సంస్థ ఆప్టేర్ పీఎల్‌సీ 37 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల తయారీకి అక్కడి ప్రభుత్వం నుంచి ఆర్డర్లను దక్కించుకుంది. స్థానిక ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ టవర్‌ టాన్సిట్‌ గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సోమవారం కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది. ఈ ఉద్గారరహిత ఎలక్ట్రానిక్‌ డబుల్‌ డెక్కర్‌ వాహనాలను షేర్బర్న్ సమీపంలోని ఆప్టేర్ పీఎల్‌సీ ప్లాంట్‌లో తయారీ చేస్తామని కంపెనీ పేర్కోంది.‘‘అభివృద్ది చెందిన నగరాలు ఉద్గార రహిత వాహనాలను రూపకల్పనకు సిద్ధమైన తరుణంలో ఆప్టేర్ పీఎల్‌సీ ఆర్డర్లను దక్కించుకుంది. పర్యావరణ సంరక్షణలో భాగం కావడం మాకు సంతోషాన్ని కలిగించే అంశం. మేము రూపకల్పన చేసే 37 మెట్రోడెక్కర్ ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రతి ఏడాది 1800 టన్నుల గ్రీన్‌ హౌజ్‌ గ్యాస్‌ ఉద్ఘారాలు విడుదల కాకుండా నిర్మూలన చేస్తాయి.’’ అని అశోక్‌ లేలాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో విపిన్ సోంది తెలిపారు. ఆప్టేర్ దక్కించుకున్న ఆర్డర్లతో మార్కెట్లో లాభాలను మాత్రమే గడించుకోవడమే కాకుండా, పరిశ్రమకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తామని విపిన్‌ తెలిపారు.

ఆర్డర్లను దక్కించుకోవడంతో అశోక్‌లేలాండ్‌ షేరు 1శాతం వరుకు లాభపడి రూ.84.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 1శాతం నష్టంతో రూ.82.95 వద్ద స్థిరపడింది. 
 



You may be interested

రూ.2000 నోటు కనుమరుగు?

Monday 10th February 2020

చలామణిలోకి పంపకుండా నిరోధిస్తున్న టాప్‌ బ్యాంకు ప్రింటింగ్‌ అపేసిన ఆర్‌బీఐ కస్టమర్లకు జరిపే విత్‌డ్రాయల్స్‌లో రూ.2000 నోటును ఇవ్వవద్దంటూ ప్రముఖ పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకు తన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు సూచనలిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ ఒక కథనంలో వెల్లడించింది. తమ ఏటీఎంల్లో సైతం ఈ నోటును ఉంచొదని బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు బ్యాంకు ఎంప్లాయిస్‌కు పంపిన ఈమెయిల్‌లో వివరాలను బిజినెస్‌ ఇన్‌సైడర్‌ బయటపెట్టింది. కస్టమర్లకు రూ.2000 నోటు ఇవ్వవద్దని బ్యాంకు

రెండో రోజూ మార్కెట్లు డీలా

Monday 10th February 2020

సెన్సెక్స్‌ 162 పాయింట్లు డౌన్‌ 67 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నేలచూపే నీరసంగా కదులుతున్న యూరప్‌ మార్కెట్లు అంతకంతకూ కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో దేశీయంగానూ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. వెరసి సెన్సెక్స్‌ 162 పాయింట్లు క్షీణించి 40,980 వద్ద నిలవగా.. నిఫ్టీ 67 పాయింట్ల వెనకడుగుతో 12,031 వద్ద ముగిసింది. వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోగా..

Most from this category