News


అశోక్‌ లేలాండ్‌ లాభం రూ.275 కోట్లు

Thursday 1st August 2019
news_main1564637107.png-27466

  • సగం తగ్గిన లాభం 
  • రూ.600 కోట్లు సమీకరణ

చెన్నై: హిందుజా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.275 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.467 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,194 కోట్ల నుంచి రూ.6,612 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ ధీరజ్‌ జి. హిందుజా తెలిపారు.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.33,325 కోట్ల ఆదాయం, రూ.2,195 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొన్నారు. 
4 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా...
వాహన పరిశ్రమలో అమ్మకాలు 17 శాతం తగ్గగా, తమ కంపెనీ మార్కెట్‌ వాటా 4 శాతం పెరిగిందని ధీరజ్‌ వెల్లడించారు. తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 12 శాతం పెరిగాయని వివరించారు. భారత్‌ స్టేజ్‌ సిక్స్ వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎన్‌సీడీలు, బాండ్ల జారీ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనున్నామని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని వివరించారు. You may be interested

మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోన్ల హవా..

Thursday 1st August 2019

కెమెరాకే కస్టమర్ల తొలి ప్రాధాన్యత పాప్‌-అప్‌ మోడళ్లకు డిమాండ్‌ సామాజిక మాధ్యమాల ప్రభావం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్‌.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్‌ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్‌-అప్‌, మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న

అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం రూ.128 కోట్లు

Thursday 1st August 2019

తగ్గిన మొండి కేటాయింపుల భారం  మొత్తం ఆదాయం రూ.4,747 కోట్లకు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్‌(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర

Most from this category