News


అశోక్‌ లేలాండ్‌ లాభం 87 శాతం డౌన్‌

Thursday 13th February 2020
news_main1581568433.png-31747

  • రూ.5,189 కోట్లకు తగ్గిన ఆదాయం
  • రెండు నెలల్లో బీఎస్‌-6 హెవీ డ్యూటీ వెహికల్స్‌

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 87 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.429 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.57 కోట్లకు పడిపోయినట్లు అశోక్‌ లేలాండ్‌ ఎమ్‌డీ, సీఈఓ విపిన్‌ సోంధి చెప్పారు. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.7,490 కోట్ల నుంచి రూ.5,189 కోట్లకు తగ్గిందని తెలియజేశారు. 
తగ్గిన వ్యయాలు...
ఈ క్యూ3లో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 39 శాతం మేర తగ్గటంతో తమ కంపెనీ అమ్మకాలు కూడా అందుకు తగ్గట్టే ఉన్నట్లు విపిన్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2020కు ముందే భారీ వాహనాల మోడళ్లలో బీఎస్‌-6 వేరియంట్లను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను కొనుగోలు చేసేందుకు వినూత్నమైన మాడ్యులర్‌ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. వ్యయ నియంత్రణ పద్ధతులను కొనసాగిస్తున్నామని, పలితంగా వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే తగ్గాయని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ గోపాల్‌ మహదేవన్‌ పేర్కొన్నారు. You may be interested

ఐఆర్‌సీటీసీ హైజంప్‌- నాట్కో కుదేల్‌

Thursday 13th February 2020

సరికొత్త గరిష్టానికి ఐఆర్‌సీటీసీ నాట్కో ఫార్మా 6 శాతం పతనం  క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రైల్వే రంగ పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. అయితే మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఫార్మా రంగ హైదరాబాద్‌ కంపెనీ నాట్కో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఐఆర్‌సీటీసీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. నాట్కో భారీ

హిందాల్కో లాభం రూ.1,062 కోట్లు

Thursday 13th February 2020

24 శాతం క్షీణత  రూ.29,494 కోట్లకు తగ్గిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: హిందాల్కో ఇండస్ట్రీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.1,062 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో ఆర్జించిన నికర లాభం, రూ.1,394 కోట్లుతో పోల్చితే 24 శాతం క్షీణించిందని కంపెనీ ఎండీ సతీశ్ పాయి చెప్పారు. ఆదాయం రూ.33,483 కోట్ల నుంచి రూ.29,494 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు.  పటిష్టంగా నొవెలిస్‌

Most from this category