News


యస్ బ్యాంకుపై పూర్తి నమ్మకం ఉంది

Thursday 3rd October 2019
news_main1570075054.png-28686

  • ప్రమోటరు అశోక్ కపూర్ కుటుంబం స్పష్టీకరణ

ముంబై: మొండిబాకీలు, ఇతర వివాదాలతో షేరు జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ యస్‌ ‍బ్యాంకును గట్టెక్కించే అంశంలో మేనేజ్‌మెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటరు అశోక్ కపూర్ కుటుంబం స్పష్టం చేసింది. "యస్‌ బ్యాంకుకు మా పూర్తి మద్దతు ఉంది. బ్యాంకు మేనేజ్‌మెంటుపై పూర్తి నమ్మకం ఉంది" అని అశోక్ కపూర్ కుమార్తె షగున్ గోగియా తెలిపారు. మరో ప్రమోటరు రాణా కపూర్‌ కుటుంబం యస్‌ బ్యాంకు నుంచి నిష్క్రమించే పరిస్థితులు నెలకొన్న తరుణంలో షగున్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులో తమకు 8.7 శాతం పైగా వాటా ఉందని, కేవలం కొంత భాగం మాత్రమే తనఖాలో ఉందని షగున్ తెలిపారు. గవర్నెన్స్‌పరమైన లోపాల కారణ౾ంగా సీఈవోగా రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు ఆర్‌బీఐ నిరాకరించినప్పట్నుంచీ యస్ బ్యాంకు షేరు పతనమవుతున్న సంగతి తెలిసిందే. 2018 ఆగస్టులో రూ. 404 స్థాయిని తాకిన షేరు ప్రస్తుతం జీవిత కాల కనిష్టమైన రూ. 32.20కి పడిపోయింది. 



You may be interested

చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై

Thursday 3rd October 2019

భారత్‌, వియత్నాంలో మొబైల్స్ ప్లాంట్ల విస్తరణ చైనాలో తీవ్రమైన పోటీ, వ్యయాలే కారణం సియోల్‌: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్‌ ఇటీవల జూన్‌లో

71.22 వద్ద రూపీ ప్రారంభం

Thursday 3rd October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 14 పైసలు బలహీనపడి 71.22 వద్ద ప్రారంభమైంది. గాంధీ జయంతి కారణంగా బుధవారం కరెన్సీ మార్కెట్‌ ప్రారంభంకాలేదు. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో మంగళవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 20 పైసలు పడిపోయి 71.08 ముగిసింది.    యుఎస్‌-చైనా మధ్య చర్చలు అక్టోబర్‌ 10న జరగనుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. అంతేకాకుండా

Most from this category