News


అర్‌వింద్‌ లాభం రూ.50 కోట్లు

Saturday 26th October 2019
news_main1572065030.png-29158

  • రూ.1,962 కోట్లకు మొత్తం అమ్మకాలు 

న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అర్‌వింద్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.50 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించామని అర్‌వింద్‌ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.1,962 కోట్లుగా ఉండగా, గత క్యూ2లో రూ.1,793 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఈ కంపెనీ నుంచి బ్రాండెడ్‌ దుస్తుల విభాగం అర్‌వింద్‌ ఫ్యాష
న్స్‌ విడిపోవడం(డీమెర్జ్‌ కావడం)తో ఈ క్యూ2 ఫలితాలను, గత క్యూ2 ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.1,900 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. టెక్స్‌టైల్‌ విభాగం ఆదాయం రూ.1,648 కోట్లకు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్‌ సెగ్మెంట్‌ ఆదాయం రూ.183 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 9-10 శాతం మేర వృద్ధి చెందగలదని,  నిర్వహణ లాభ మార్జిన్‌ 10 శాతంగా ఉండొచ్చని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. You may be interested

మ్యారికో అమ్మకాలు రూ.1,829 కోట్లు

Saturday 26th October 2019

ఒక్కో షేర్‌కు రూ.2.75 మధ్యంతర డివిడెండ్‌  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ మ్యారికో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 17 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.253 కోట్లకు పెరిగిందని మ్యారికో తెలిపింది. గత క్యూ2లో రూ.1,837 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.1,829 కోట్లకు తగ్గాయని పేర్కొంది. రూ. 1 ముఖ విలువ గల

జుబిలంట్‌ లైఫ్‌ లాభం 19 శాతం అప్‌

Saturday 26th October 2019

ఆదాయం రూ.2,266 కోట్లకు  న్యూఢిల్లీ: జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 19 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.210 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.249 కోట్లకు పెరిగిందని జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ తెలిపింది.  కార్యకలాపాల ఆదాయం రూ.2,269 కోట్ల నుంచి రూ.2,266 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ హరి ఎస్‌. భర్తియ చెప్పారు. ఆదాయం తగ్గినా,

Most from this category