News


ఐబీఎం సీఈఓ గా భారతీయుడు

Friday 31st January 2020
news_main1580457316.png-31371 

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన మరో టెక్నాలజీ నిపుణుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన మల్టీనేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ అయిన ఐబీఎం (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ కార్పోరేషన్‌)కు భారతసంతతికి చెందిన  అరవింద్‌ కృష్ణ సీఈఓ(చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఆఫీసర్‌) గా నియమితులయ్యారు. ఐబీఎం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లంతా కలిసి అరవింద్‌‌ కృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కృష్ణ  ప్రస్తుతం ఐబీఎంలో క్లౌడ్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగానికి సీనియర్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీఈఓ గా వ్యవహరిస్తున్న రొమేటీ గత నలభైఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది ఆమె పదవీ విరమణ చేయనుండడంతో కొత్త సీఈఓగా అరవింద్‌ కృష్ణని ఎన్నుకున్నారు. కృష్ణ ఏప్రిల్‌ 6 నుంచి ఐబీఎం సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రొమేటీ మాట్లాడుతూ...కృష్ణ చాలా తెలివైన టెక్నాలజీస్ట్‌ అని, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌చెయిన్‌లను అభివృద్ధి చేయడంతో అరవింద్‌ కృష్ణ తనదైన మార్క్‌ను చూపిస్తారని రొమేటీ అన్నారు. టెక్నాలజీ నైపుణ్యమేగాక భవిష్యత్‌ వాపారాన్ని ముందుకు నడిపించగల నాయకుడని ఆమె పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఐబీఎం క్లౌడ్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ను తనకున్న అనుభవం, పరిజ్ఞానంతో అభివృద్ది పధంలో నడిపిస్తారని చెప్పారు. కాగా  57ఏళ్ల కృష్ణ ఐఐటీ కాన్పూర్‌ నుంచి డిగ్రీ పట్టా పొందారు.  తరువాత  ఇల్లినాయిస్‌ యూనివర్సిటిలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డీ పూర్తి చేశారు. 1990లో ఐబీఎంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి సీఈఓగా ఎదిగారు. సీఈఓగా ఎంపికైన సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ఐబీఎంకు తదుపరి సీఈఓగా తనను ఎన్నుకోవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ చాలా ఆనందంగా ఉందన్నారు. తన మీద నమ్మకం ఉంచిన బోర్డు సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఐబీఎంలో ఎంతో మంది టెక్నాలజీ నిపుణులు ఉన్నారని, వారి సామర్థ్యం ఐడియాలతో క్లయింట్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఐబీఎం ,రెడ్‌ హ్యాటర్స్‌, క్లయింట్లతో కలసి పనిచేస్తూ.. ఐటీ ఇండస్ట్రీ స్థితిగతుల్ని మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐబీఎం సీఈఓగా ఎన్నికైన అరవింద్‌ కృష్ణ.. భారసంతతి గ్లోబల్‌ ఐటీ దిగ్గజాల సరసన చేరారు. మల్టీనేషనల్‌ కంపెనీల సీఈఓల జాబితాలో సత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్‌), సుందర్‌ పిచాయ్‌ (గూగుల్‌ అండ్‌ ఆల్ఫాబెట్‌), అజయ్‌ బంగా(మాస్టర్‌ కార్డ్‌), ఇంద్రనూయి(పెప్సీకో మాజీ సీఈవో), శాంతాను నారాయణ్‌(అడోబ్‌) ఉన్న సంగతి తెలిసిందే. 
  
    
    You may be interested

రికార్డుస్థాయికి ఐఆర్‌సీటీసీ

Friday 31st January 2020

కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేల్వే రంగంలో సేవలను అందించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) శుక్రవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 3.65శాతం లాభపడి రూ.1177.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:30నిల.లకు షేరు క్రితం

మార్కెట్లో ఆరంభలాభాలు ఆవిరి

Friday 31st January 2020

మార్కెట్లో ఆర్థిక సర్వే గణాంకాలు, బడ్జెట్‌ అప్రమత్తత 12వేల దిగువకు నిఫ్టీ  గరిష్టం నుంచి 450 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మెటల్‌, ఫార్మా, ఐటీ, అటో షేర్లలో అమ్మకాలు  మిడ్‌సెషన్‌ సమయానికల్లా మార్కెట్‌ ఉదయం లాభాల్ని కోల్పోయింది. ప్రధాన సూచీలైన నిఫ్టీ 12వేల దిగువకు, సెన్సెక్స్‌ 41వేల స్థాయిని కోల్పోయింది. మరికాసేపట్లో కేంద్ర ఎకానమీ చీఫ్‌ అడ్వైజర్‌ క్రిష్ణమూర్తి  2019-20 ఆర్థిక సంవత్సరపు ఎకానమి సర్వేని విడుదల చేయనున్నారు. అలాగే రేపు లోక్‌ సభలో కేంద్ర

Most from this category