News


అసలు వాళ్లు ఇన్ఫీ ఉద్యోగులేనా..నీలకేని

Saturday 11th January 2020
news_main1578718051.png-30855

విజిల్‌బ్లోయర్స్‌పై నందన్‌ అనుమానం
గతేడాది ఇన్ఫోసిస్‌ టాప్‌మేనేజ్‌మెంట్‌పై కొందరు విజిల్‌ బ్లోయర్లు చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని కంపెనీ ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. కంపెనీ టాప్‌మేనేజ్‌మెంట్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చైర్మన్‌ నందన్‌ నీలకేని సదరు విజిల్‌ బ్లోయర్స్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వాళ్లు నిజంగా తమ కంపెనీ ఉద్యోగులేనా? ఈ విషయం చెక్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫైనాన్స్‌ విభాగ ఉద్యోగులు అత్యున్నత నైతిక ప్రమాణాలతో ఉంటారని, వీరు ఇలాంటివి చేయరని చెప్పారు. కంపెనీపై ఆరోపణల్లో బయటివారి పాత్ర ఉండొచ్చని పరోక్ష అనుమానం వ్యక్తం చేశారు. కానీ కంపెనీ ఈ విషయమై ఎలాంటి విచారణ చేపట్టబోదని తేల్చిచెప్పారు. యూఎస్‌ చట్టాలు విజిల్‌బ్లోయర్లకు పలు రక్షణలు ఇస్తున్నాయని, తాము ఆ చట్టాలను గౌరవిస్తామని చెప్పారు. తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కంపెనీపరంగా విచారణ పూర్తయిందన్నారు.

విజిల్‌బ్లోయర్స్‌ ఆరోపణలపై కంపెనీ స్వతంత్ర లీగల్‌ కౌన్సిల్‌ సాయంతో విచారణ జరిపింది. కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌లు అనైతిక అకౌంటింగ్‌ విధానాలకు పాల్పడ్డారని, తద్వారా ఫలితాలను ఎక్కువ చేసి చూపారని గతేడాది కొందరు విజిల్‌బ్లోయర్లు యూఎస్‌ సెక్‌కు మెయిల్స్‌ పెట్టారు. దీంతో ఒక్కరోజులో కంపెనీ షేరు భారీగా పతనమైంది. తమ విచారణ పూర్తయినా సెబి, సెక్‌ విచారణ జరుగుతోందని, తాము వీటికి పూర్తిగా సహకరిస్తామని నందన్‌ చెప్పారు. ఈ రెండు విచారణలు పూర్తయి కంపెనీకి క్లీన్‌ చిట్‌ వస్తే ఇన్ఫీపై విశ్వసనీయత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 



You may be interested

లాభంతో ముగిసిన పసిడి

Saturday 11th January 2020

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు శుక్రవారం లాభంతో ముగిశాయి. అమెరికాలో నిన్నరాత్రి మార్కెట్ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 5.80డాలర్లు లాభపడి 1,560.10 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా డిసెంబర్‌ పేరోల్‌ వృద్ధి గణాంకాలు అంచనాలకు మించిన నమోదు కాకపోవడంతో బాండ్‌ ధరలు పెరిగాయి. తద్వారా తగ్గిన బాండ్‌ ఈల్డ్‌లు...వడ్డీరేట్ల తగ్గింపునకు దారి తీయవచ్చనే అశావహ అంచనాలు పసిడికి డిమాండ్‌ పెంచినట్లు బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కిందటేడాదిలో స్పాట్‌ బంగారం ధర

పాజిటివ్‌ జోన్‌లో ఇన్ఫోసిస్‌

Saturday 11th January 2020

విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణలు తేలిపోవడం సానుకూలం పటిష్ట ఫలితాలు, గైడెన్స్‌ పెంపుతో షేరుకి జోష్‌  ప్రధాన విభాగాల్లో వృద్ధిపైనే భవిష్యత్‌ కదలికలు క్యూ3 తదుపరి మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ పనితీరు ఆకట్టుకున్నప్పటికీ కొన్ని అంశాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే.. ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) పెంపుతోపాటు..విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ ఆడిట్‌ కమిటీ తోసిపుచ్చడం కంపెనీకి సానుకూల అంశాలని తెలియజేశారు. స్వతంత్ర న్యాయ సంస్థ

Most from this category