STOCKS

News


యాపిల్‌ ... భారత్‌ జీడీపీలో సగం!

Thursday 30th January 2020
news_main1580363234.png-31329

1.42 లక్షల కోట్ల డాలర్లకు చేరిన యాపిల్‌ విలువ
భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ మొత్తం విలువలో ఇది సగానికికంటే ఎక్కువ
అదరగొట్టే త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన యాపిల్‌ సంస్థ నూతన రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో షేరు ఆల్‌టైమ్‌ హై 327.25 డాలర్లను చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 1.42 లక్షల కోట్ల డాలర్లను దాటింది. ఇది భారత ఎకానమీ విలువలో దాదాపు సగానికి సమానం. 2020 అంచనాల ప్రకారం భారత జీడీపీ విలువ 3.202 లక్షల కోట్ల డాలర్లు. ప్రస్తుతం యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌ ఇండియా జీడీపీలో దాదాపు సగానికి సమానం. మరోవైపు యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌ మొత్తం జర్మనీ ఈక్విటీ ఇండెక్స్‌ డాక్స్‌ మార్కెట్‌ విలువను దాటేసింది. డాయిష్‌ బ్యాంక్‌, బీఎండబ్ల్యు, లుఫ్తాన్సా లాంటి దిగ్గజ కంపెనీలు లిస్టయిన డాక్స్‌ మార్కెట్‌ క్యాప్‌ 1.36 లక్షల కోట్ల డాలర్లు. ఈ నెల 28న యాపిల్‌ తన త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. బలమైన విక్రయాలతో యాపిల్‌ రెవెన్యూ 9 శాతం పెరిగింది. దీంతో ఈపీఎస్‌ 19 శాతం దూసుకుపోయి 4.99 డాలర్ల ఆల్‌టైమ్‌ హైని చేరింది. యాపిల్‌ అద్భుత ప్రదర్శనతో దానికి ప్రధాన సరఫరాదారులైన స్కైవర్క్స్‌ సొల్యూషన్స్‌, పీహెచ్‌ఎల్‌ఎక్స్‌ సెమికండక్టర్స్‌సైతం అద్భుత ఫలితాలు ప్రకటిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని కంపెనీల్లో యాపిల్‌ కన్నా ముందు కేవలం ఒక్క సౌదీ అరామ్‌కో మాత్రమే ఉంది. అరామ్‌కో మార్కెట్‌ విలువ దాదాపు 1.8 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచంలో కేవలం ఐదు కంపెనీలు మాత్రమే లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌క్యాప్‌ను ఇంతవరకు సాధించాయి. అరామ్‌కో, యాపిల్‌, పెట్రోచైనా, మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌ మాత్రమే ఇంతవరకు ట్రిలియన్‌ డాలర్ల విలువను దాటేశాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల మార్కెట్‌ క్యాప్‌ దాదాపు 2.15 లక్షల కోట్ల డాలర్లు. అంటే  యాపిల్‌ కంపెనీ విలువ కన్నా వీటి విలువ కేవలం దాదాపు 70వేల కోట్ల డాలర్లు అధికమన్నమాట. ఇక మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశీయంగా టాప్‌ కంపెనీలైన రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ విలువలు వరుసగా దాదాపు 12900 కోట్లు, 11300 కోట్లు, 9700 కోట్లు, 6300కోట్లు, 5900కోట్ల డాలర్లున్నాయి. అంటే టాప్‌ 5 ఇండియన్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ కలిపినా యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌లో సగానికి సమానం కాదన్న మాట! 



You may be interested

ఈ షేర్లు 52 వారాల గరిష్టం

Thursday 30th January 2020

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించనుండటం, జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీనికితోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై అంతర్జాతీయంగా నేడు అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు సైతం ఆందోళనలు పెంచాయి. దీంతో  ఒక్కరోజులోనే తిరిగి ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత నీరసించాయి. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 222 పాయింట్లు క్షీణించి

గ్రీన్‌లామ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా దూకుడు

Thursday 30th January 2020

5 శాతంపైగా ఎగసిన షేర్లు మార్కెట్లు నష్టాల బాటలో నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై అంతర్జాతీయ స్థాయిలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు దేశీయంగా తిరిగి ఆందోళనలు పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత నీరసించాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 40,997ను తాకింది. తద్వారా 41,000 పాయింట్ల దిగువకు చేరింది. ఇక

Most from this category