News


వచ్చే ఏడాది ఇండియాలో యాపిల్‌ స్టోర్‌!

Thursday 27th February 2020
news_main1582797535.png-32145

ప్రముఖ ఐఫోన్‌ దిగ్గజ కంపెనీ యాపిల్‌ త్వరలో భారత్‌లో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. క్యాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్‌ కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్‌ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాదానంగా యాపిల్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ టిమ్‌కుక్‌ 2021లో ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా భారత్‌లో యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2021లో స్థానిక భాగస్వామ్యం లేకుండా  యాపిల్‌ కంపెనీ సొంతంగా బెంగుళూరులో యాపిల్‌ స్టోర్‌  ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అయితే స్టోర్‌ ఏర్పాటుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు. కాగా యాపిల్‌ కంపెనీ 2018లోనే ఇండియలో స్టోర్‌ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు చేసుకోగా, ఇండియాలో ఉన్న చట్టాలకు అనుకూలంగా స్థానిక భాగస్వామ్యంతో యాపిల్‌స్టోర్‌ ఏర్పాటు చేయాలని ఇండియా ప్రభుత్వం కోరడంతో అప్పుడు యాపిల్‌ కంపెనీ స్టోర్‌ ఏర్పాటును వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్‌ కరోనా వైరస్‌  యాపిల్‌ కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపారు. అంతేగాక తమ త్రైమాసిక ఫలితాలు ఆశించినంతగా లేవని తెలిపారు. యాపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్‌, మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్స్‌ వంటి వాటికి విడిభాగాలన్నింటిని చైనా తయారు చేస్తుంది. కరోనా వైరస్‌ విజృంభించడంతో చైనా పరిశ్రమలు మూతపడి, తమ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి జరగకపోవడంతో విక్రయాలు జరగలేదన్నారు. 

 



You may be interested

విదేశీ ఎఫెక్ట్‌- నష్టాల ముగింపు

Thursday 27th February 2020

సెన్సెక్స్‌ 143 పాయింట్లు డౌన్‌ నిఫ్టీ 45 పాయింట్లు వీక్‌ పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ బోర్లా అగ్రదేశం అమెరికాకు సైతం కరోనా వైరస్‌ భయాలు చేరడంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. బుధవారం వరుసగా ఐదో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు క్షీణించగా.. దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో రోజంతా నష్టాలమధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతోనే నిలిచాయి. సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 39,746 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 45

కరోనాతో సమస్యలతోపాటు అవకాశాలూ ఉంటాయ్‌!

Thursday 27th February 2020

నిఫ్టీ కంపెనీల లాభాలు 5 శాతం డౌన్‌ కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు లేకుంటే మరింత వీక్‌ - వినయ్‌ పండిట్‌, ఇండియానివేష్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు ఓవైపు సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నప్పటికీ మరోపక్క అవకాశాలు సైతం లభించే వీలున్నట్లు చెబుతున్నారు వినయ్‌ పండిట్‌. ఇండియానివేష్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ అయిన నివేష్‌ ఒక ఇంటర్వ్యూలో మార్కెట్ల ట్రెండ్‌, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ తదితర పలు అంశాలపై అభిప్రాయాలను

Most from this category