News


యాపిల్‌ లాభం 2,200 కోట్ల డాలర్లు

Thursday 30th January 2020
news_main1580354984.png-31316

  • ఆదాయం 9,180 కోట్ల డాలర్లు 
  • డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ లాభం, ఆదాయం

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ గత ఏడాది అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్లో రికార్డ్‌ స్థాయి ఆదాయాన్ని, నికర లాభాన్ని ఆర్జించింది. గత  ఏడాది అక్టోబర్‌- డిసెంబర్‌ క్వార్టర్‌కు గాను 2,200 కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.1,56,200 కోట్లు) నికర లాభం సాధించామని యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలియజేశారు. మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో 9,180 కోట్ల డాలర్లకు (రూ.6,51,780 కోట్లకు) పెరిగిందని పేర్కొన్నారు, నికర లాభం, ఆదాయాల పరంగా తమ  కంపెనీకి ఇవే అత్యధిక మొత్తాలని వెల్లడించారు. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ అమ్మకాల శాతం 61గా ఉన్నట్లు చెప్పారు. 
5,600 కోట్ల డాలర్లకు ఐఫోన్‌ ఆదాయం 
డిసెంబర్‌ క్వార్టర్లో ఐఫోన్ల ఆదాయం 8 శాతం వృద్ధితో 5,600 కోట్ల డాలర్లకు పెరిగింది. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రొ, ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ మోడళ్లకు మంచి డిమాండ్‌ ఉండటమే దీనికి కారణం. ఐప్యాడ్‌ల ఆదాయం 600 కోట్ల డాలర్లు, మ్యాక్‌ల ఆదాయం 720 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 

భారత్‌లో....
యాపిల్‌ కంపెనీ అమ్మకాలు భారత్‌లో జోరుగా ఉన్నాయి. ఐఫోన్‌ అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించగా, ఐపాడ్‌ల అమ్మకాలు పటిష్టంగానే ఉన్నాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో వేగంగా వృద్ధి సాధించిన బ్రాండ్లలో ఒకటిగా యాపిల్‌ నిలిచిందని రీసెర్చ్‌ సంస్థ, కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది. భారత్‌లో అమ్మకాలు గణనీయంగా పెరగగలవని యాపిల్‌ భావిస్తోంది. అందుకే ఇక్కడ ఐఫోన్ల తయారీ జోరును పెంచింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ తయారీని గతేడాది ప్రారంభించింది. చెన్నైలోని మూతపడిన నోకియా ప్లాంట్‌ను టేకోవర్‌ చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ఈ మార్చి నుంచి ఆరంభమవుతాయని అంచనా. ఇక్కడ చార్జర్లు, ఇతర పరికరాలను యాపిల్‌ కంపెనీ తయారు చేయనుంది. హోమ్‌పాడ్‌ పేరుతో స్మార్ట్‌ స్పీకర్‌ను వచ్చే నెల చివరకల్లా మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. గూగుల్‌ హోమ్‌, అమెజాన్‌ ఈకోలకు గట్టిపోటీనివ్వగలదని భావిస్తున్న  ఈ హోమ్‌పాడ్‌ స్మార్ట్‌ స్పీకర్‌ ధర రూ.19,900. 



You may be interested

యథాతథ పాలసీ అమలుకే ఫెడ్‌ ఓటు

Thursday 30th January 2020

ఉపాధి గణాంకాలు పటిష్టంగానే ఉన్నాయ్‌ నిరుద్యోగిత కనిష్ట స్థాయిలవద్దే నమోదవుతోంది ప్రస్తుతం వడ్డీ రేట్లను సవరించవలసిన అవసరంలేదు - ఫెడరల్‌ రిజర్వ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ  అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. బుధవారం ముగిసిన రెండు రోజుల పాలసీ సమావేశాల్లో భాగంగా ఫండ్స్‌ రేట్లను 1.5-1.75 శాతం వద్దే అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ)

కాకినాడలో లలిత జ్యూయలర్స్‌ ప్రారంభం

Thursday 30th January 2020

బంగారు, వజ్రాభరణాల విక్రయ సంస్థ లలిత జ్యూయలర్స్‌ 25వ బ్రాంచ్‌ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు, లలిత జ్యూయలర్స్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌ కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు.  నాణ్యత, ధర విషయంలో రాజీలేని విధంగా బంగారు, వజ్రాభరణాల విక్రయాల్లో ఖ్యాతిపొందిన లలిత జ్యూయలర్స్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావడం ఈ

Most from this category