News


ఐట్యూన్స్‌కు యాపిల్ గుడ్‌బై..

Wednesday 5th June 2019
news_main1559721127.png-26101

  • ఇకపై మూడు యాప్స్‌గా మార్పు

శాన్‌ జోస్‌: ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్‌ యాప్‌ ఇకపై కనుమరుగు కానుంది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. యాపిల్‌ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్, యాపిల్‌ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్‌ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్‌ డిమాండ్‌ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్‌ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు యాపిల్‌ ప్రయత్నిస్తోంది. యాపిల్‌ టీవీ యాప్‌ను స్మార్ట్‌ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్‌ ఫైర్‌ టీవీ మొదలైన థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రెగ్‌ ఫెడరిగి తెలిపారు.



You may be interested

జూన్‌లో బుల్స్‌దే పైచేయి?!

Wednesday 5th June 2019

11ఏళ‍్లలో ఆరు సార్లు ర్యాలీ జరిపిన సూచీలు దేశీయ మార్కెట్లు జూన్‌ సీరిస్‌ను లాభాలతో ఆరంభించాయి. సూచీలు జూన్‌ ఆరంభంలో ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో ఇకపై ర్యాలీ కొనసాగుతుందా? లేక కన్సాలిడేషన్‌, కరెక‌్షన్‌ ఉంటాయా? అనే విషయమై రిటైల్‌ ఇన్వెస్టర్లలో డైలమా నెలకొంది. గత దశాబ్దకాలం పరిశీలిస్తే జూన్‌ నెల కొంతవరకు బుల్స్‌కే అనుకూలంగా ఉందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గత పదకొండేళ్లలో 6 సార్లు సూచీలను బుల్స్‌ కంట్రోల్‌

3నెలల గరిష్టం వద్ద పసిడి

Wednesday 5th June 2019

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పసిడి ధర బుధవారం మూడు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు మరో 10డాలర్లు లాభపడింది. ఔన్స్‌ పసిడి 1,338.95 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలతో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపవచ్చని ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ వడ్డీరేట్ల అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తున్నాయి. పావెల్‌

Most from this category