News


అపోలో హాస్పిటల్స్‌ లాభం 80 శాతం అప్‌

Friday 14th February 2020
news_main1581650226.png-31774

  • అపోలో హాస్పిటల్స్‌ లాభం 80 శాతం అప్‌
  • రూ.90 కోట్లకు నికర లాభం 
  • ఒక్కో షేర్‌కు రూ.3.25 మధ్యంతర డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 80 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్‌  ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  



You may be interested

సత్యా నాదెళ్ల భారత పర్యటన

Friday 14th February 2020

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24-26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్‌ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్‌ వస్తున్నారని ఒక ఈ-మెయిల్‌ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్‌ హోదాలో ఇప్పటికే

తగ్గిన జీఎంఆర్ నష్టాలు

Friday 14th February 2020

క్యూ3లో రూ. 279 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.279 కోట్లకు తగ్గాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నష్టాలు రూ.542 కోట్లు. మరోవైపు స్థూల ఆదాయాలు రూ.1,958 కోట్ల నుంచి రూ. 2,196 కోట్లకు పెరిగాయి. కీలకమైన ఎయిర్‌పోర్ట్స్ విభాగం ఆదాయాలు రూ. 1,358 కోట్ల నుంచి రూ. 1,615 కోట్లకు, విద్యుత్

Most from this category