News


అపోలో హాస్పిటల్స్‌ లాభం రూ.77 కోట్లు

Friday 31st May 2019
news_main1559286018.png-26016

  • మార్చి త్రైమాసికంలో 29 శాతం పెరుగుదల
  • అ‍న్ని విభాగాల్లో రాణింపు

 న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ మార్చి క్వార్టర్‌కు ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్‌ నికర లాభం మార్చి త్రైమాసికంలో 29 శాతం పెరిగి రూ.77 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల్లోనూ పనితీరు మెరుగుపడడం వృద్ధికి చోదకంగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. స్టాండలోన్‌ ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.2,167 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ.1,863 కోట్ల ఆదాయంపై రూ.59 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం. నాలుగో త్రైమాసికంలో బలమైన పనితీరు ప్రదర్శించామని, ఫార్మసీ, హాస్పిటల్స్‌ విభాగాల్లోనూ ఆదాయం, మార్జిన్ల వృద్ధి కొనసాగిందని కంపెనీ తెలియజేసింది. ఇక 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి అపోలో హాస్పిటల్స్‌ నికర లాభం రూ.303 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.233 కోట్లుగానే ఉండడం గమనార్హం. అలాగే ఆదాయం సైతం అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.7,183 కోట్ల నుంచి రూ.8,336 కోట్లకు పెరిగింది. మొదటిసారి ఎబిట్డా రూ.1,000 కోట్ల మార్క్‌ను 2018-19లో అధిగమించినట్టు అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది. 
మా స్థానం బలోపేతం...
‘‘దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఆరోగ్య సేవల సంస్థగా 2018-19లో మా స్థానం బలోపేతం అయింది. పలు విభాగాల్లో బలమైన వృద్ధి నమోదైనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి’’ అని అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి పేర్కొన్నారు. హెల్త్‌కేర్‌ సేవల విభాగం స్టాండలోన్‌ ఆదాయం 2018-19లో 14 శాతం వృద్ధితో రూ.44,50 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.3,914 కోట్లుగా ఉంది. ‘‘2018-19లో కొత్తగా 490 ఫార్మసీ స్టోర్లను తెరిచాం. అలాగే, ప్రస్తుతమున్న వాటిల్లో 83 స్టోర్లను మూసివేయడం జరిగింది. దీంతో నికరంగా 407 స్టోర్లు పెరిగాయి. 2019 మార్చి నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 3,428గా ఉంది’’అని అపోలో హా‍స్పిటల్స్‌ వెల్లడించింది. ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. 



You may be interested

ఆగని క్రూడాయిల్‌ ధర పతనం

Friday 31st May 2019

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు బేరిష్‌గానే కదలాడుతున్నాయి. శుక్రవారం పతనంతో క్రూడ్‌ ధరలు మార్చిలో చూసిన కనిష్ఠాలకు చేరాయి. యూఎస్‌, చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు పెరగడం, ముడిచమురు ఉత్పత్తి రికార్డు స్థాయిలకు చేరడంతో క్రూడ్‌ ధరలు నవంబర్‌ తర్వాత అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసేదిశగా కదులుతున్నాయి. ఈ వారంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 66.28 డాలర్ల వరకు చేరింది. డబ్ల్యుటీఐ క్రూడ్‌ ధర దాదాపు 56 డాలర్లకు

టెక్‌ మహీంద్రా, సిస్కో జట్టు

Friday 31st May 2019

హైదరాబాద్‌: టెక్‌ మహీంద్రా తన హైదరాబాద్‌ క్యాంపస్‌లో సిస్కో డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. 14,000కుపైగా లైవ్‌ యూజర్లతో ఒకానొక అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ క్యాంపస్‌ నెట్‌వర్క్‌గా అవతరించినట్టు పేర్కొంది. టెక్‌ మహీంద్రా ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ)లో ఆటోమేషన్‌, అనలైటిక్స్‌, సెక్యూరిటీ విబాగాల్లో సిస్కోతో భాగస్వామ్యం ఫలితాలను ఇవ్వగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సిస్కోతో భాగస్వామ్యం ఎంతో ప్రతిభావంతమైనదని, డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌ వంటి విభాగాల్లో బలోపేతం

Most from this category