News


రాణా కపూర్‌పై కొత్తగా మరో కేసు

Wednesday 18th March 2020
news_main1584501334.png-32542

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్‌లో  ఈడీ పేర్కొంది. మొండిబాకీల వసూలు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించినందుకు గాను కొన్ని బడా కార్పొరేట్ల నుంచి కపూర్‌కు ముడుపులు ముట్టాయంటూ ఈడీ ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. 

- యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 7.97 శాతం వాటా కొనుగోలు చేసినట్లు ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ 7.97 శాతం, యాక్సిస్ బ్యాంకు 4.78 శాతం,  కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ చెరి 2.39 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 1.99 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. 



You may be interested

మార్కెట్లోకి ‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్‌ ఎడిషన్‌

Wednesday 18th March 2020

- ధర రూ. 21.21 లక్షలు  న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తన పాపులర్‌ మల్టీ-పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 2.4 లీటర్ల డీజిల్‌, 5 స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లతో లీడర్‌షిప్‌ ఎడిషన్‌ పేరిట

విదేశాలకు గోఎయిర్‌ సర్వీసులు రద్దు

Wednesday 18th March 2020

ముంబై: కరోనా వైరస్ భయాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సేవలు నిలిపివేస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్‌ మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 దాకా సర్వీసులు ఉండవని పేర్కొంది. దీంతో రోజువారీ ఫ్లయిట్ల సంఖ్య 325 నుంచి 280కి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని వినియోగించుకునే క్రమంలో.. ఉద్యోగులకు రొటేషనల్ ప్రాతిపదికన స్వల్పకాలికంగా, తాత్కాలిక సెలవులు కూడా ఇస్తున్నట్లు

Most from this category