STOCKS

News


కార్పొరేట్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి

Monday 20th January 2020
news_main1579488572.png-31031

  • రేట్లన్నింటినీ 15 శాతం శ్లాబ్‌గా మార్చాలి
  • కేంద్రానికి పరిశ్రమల సమాఖ్య వినతి

న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్‌ రేటును తగ్గించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో తగ్గుదల లేదని తెలిపారు. తయారీ, సేవా రంగాల పన్ను రేట్లలో అసమానతలు నెలకొనడమే ఇందుకు కారణమని వివరించారు. 
    1991-92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 22 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తగ్గించింది. అయితే, కంపెనీలు దీన్ని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలను వదులుకోవాల్సి ఉంటుంది. 2023 మార్చి 31లోగా ఉత్పత్తి ప్రారంభించే తయారీ సంస్థలు, 2019 అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటైన సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే ఉంటుంది. సర్‌చార్జీ, సెస్సు దీనికి అదనం. పలు దేశాలకు దీటుగా పోటీపడేందుకు దేశీ సంస్థలకు .. తాజా రేట్ల కోత తోడ్పడనుంది. క్రమేపీ పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు దోహదపడనున్నాయి. 



You may be interested

బడ్జెట్‌ పరిభాషకు 'అర్థ్‌శాస్త్రి'

Monday 20th January 2020

సోషల్ మీడియాలో ప్రచారానికి కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: బడ్జెట్‌ పరిభాషపై సామాన్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జనవరి 22 నుంచి సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనుంది. '#అర్థ్‌శాస్త్రి' (#ArthShastri) పేరిట నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో.. పలు సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆసక్తికరమైన యానిమేటెడ్ వీడియోల రూపంలో వివరించనుంది. బడ్జెట్ ప్రక్రియ గురించి సరళమైన విధానంలో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని అధికారవర్గాలు తెలిపాయి.

రిటైర్మెంట్‌ అవసరాలకు...బెస్ట్‌ ప్లాన్‌

Monday 20th January 2020

ప్ర: మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాటిల్లో సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాను. భవిష్యత్తులో మంచి రాబడులు పొందవచ్చనే ఆలోచనే దీనికి కారణం. ఇది సరైన నిర్ణయమేనా ? - సుధీర్‌, విజయవాడ  జ: ఇది సరైన నిర్ణయమని చెప్పలేము. అలాగే కాదని కూడా చెప్పలేం. మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఎప్పుడు మంచి రాబడులనిస్తాయో, ఎప్పుడు నష్టాలను మిగులుస్తాయో ఖచ్చితంగా అంచనా వేయలేం. సాధారణంగా మార్కెట్‌ బాగున్నప్పుడు

Most from this category