STOCKS

News


రూ.700 కోట్లు కట్టండి

Saturday 8th February 2020
news_main1581133792.png-31616

  • అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా యూకే కోర్టు ఆదేశాలు

లండన్‌: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్‌ అనిల్‌ అంబానీకి బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్‌ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకు ఆఫ్‌ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌లో కండీషనల్‌ ఆర్డర్‌లో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కేసులో పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. అనిల్‌ అంబానీ నుంచి 680 మిలియన్‌ డాలర్ల చెల్లింపులను చైనా సంస్థలు తమ పిటిషన్‌లో కోరాయి. కాగా, కోర్టు ఆదేశాలను సమీక్షించి న్యాయ నిపుణుల సలహాలతో అప్పీల్‌ చేసుకునేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అనిల్‌ అంబానీ ప్రతినిధి తెలిపారు. 



You may be interested

ఎల్‌ఐసీ ఐపీఓ సరికాదు: ఫీల్డ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

Saturday 8th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఎల్‌ఐసీలోని కొంత వాటాను ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా విక్రయిస్తే... దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా నష్టం వాటిల్లుతుందని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యూఐ) అభిప్రాయపడింది. వాటా విక్రయం కొంత భాగంతోనే పరిమితం కాకుండా, భవిష్యత్తులో మరింత వాటా ఇతరుల చేతికి వెళ్లే అవకాశం ఉందని ఫెడరేషన్‌

రికార్డులకు బ్రేక్‌- యూఎస్‌ మార్కెట్‌ డీలా

Saturday 8th February 2020

0.5-1 శాతం మధ్య నీరసించిన ఇండెక్సులు మార్కెట్లను వీడని కరోనా భయాలు 8 నెలల్లో లేని విధంగా గత వారం రికార్డుల ర్యాలీ ఇండియన్‌ ఏడీఆర్‌ల నేలచూపు టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డౌన్‌ ఆర్థిక పురోగతిని పట్టిచూపుతూ జనవరిలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించి వెలువడినప్పటికీ శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. డోజోన్స్‌ 277 పాయింట్ల(0.9 శాతం) వెనకడుగుతో 29,102 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 18 పాయింట్లు(0.5 శాతం) తక్కువగా 3,328 వద్ద స్థిరపడింది.

Most from this category