News


అనిల్‌ అంబానీ విలువ ‘జీరో’

Saturday 8th February 2020
news_main1581141147.png-31623

యూకే కోర్టుకు అనిల్‌ వివరణ
ఆర్‌కామ్‌పై చైనా బ్యాంకుల కేసు నేపథ్యం

ప్రభుత్వ రంగానికి చెందిన మూడు చైనా బ్యాంకులు చేసిన ఫిర్యాదులో భాగంగా యూకే కోర్టు 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 700 కోట్లు)ను డిపాజిట్‌ చేయమని అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. 70 కోట్ల డాలర్ల(రూ. 4,900 కోట్లు) రుణ చెల్లింపుల్లో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ విఫలమైన నేపథ్యంలో అనిల్‌ అంబానీపై మూడు చైనీస్‌ బ్యాంకులు లండన్‌ కోర్టులో ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా తన నెట్‌వర్త్‌.. జీరోకు చేరిందని కోర్టుకు అనిల్‌ తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలలో తనకున్న వాటాల విలువ 8.24 కోట్ల డాలర్లకు తగ్గిందని అనిల్‌ తెలియజేశారు. అయితే చెల్లించవలసిన రుణాల(లయబిలిటీలు) రీత్యా చూస్తే నెట్‌వర్త్‌.. జీరోకు చేరిందని కోర్టుకు వెల్లడించారని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు తగిన ఆస్తులు తనవద్ద లేవని అనిల్‌ అంబానీ కోర్టుకు విన్నవించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆరు వారాల్లోగా సొమ్మును జమ చేయమంటూ అనిల్‌ను శుక్రవారం యూకే కోర్టు ఆదేశించింది. అయితే ఈ అంశంపై అప్పీల్‌ చేసేందుకు అనిల్‌ అంబానీ న్యాయసలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2012లో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు 92.5 కోట్ల డాలర్ల రుణాలిచ్చినట్లు చైనా బ్యాంకులు కోర్టుకు తెలియజేశాయి. ఈ రుణాలకు సంబంధించి అనిల్‌ అంబానీ వ్యక్తిగత పూచీ ఇచ్చినట్లు పేర్కొన్నాయి. 



You may be interested

నెలరోజులకు 5 స్టాక్‌ రికమెండేషన్లు

Saturday 8th February 2020

కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, ఆర్‌బీఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు చివరి ద్రవ్యపాలసీ సమీక్ష నిర్ణయాలు వెల్లడించిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో కొంత అనిశ్చితి వాతావరణ నెలకొంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 41వేల రేంజ్‌లో, నిఫ్టీ 12100 స్థాయిలో కదలాడుతున్నాయి. ఈ తరుణంలో నోమురా, నిర్మల్‌ బంగ్‌ బ్రోకరేజ్‌ సంస్థలు 5 షేర్లపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.  స్టాక్‌ పేరు:- సన్‌ఫార్మా రేటింగ్‌:- కొనవచ్చు బ్రోకరేజ్‌ సంస్థ:- నోమురా పస్తుత ధర:-

బుల్లిష్‌ సంకేతాలు ఇస్తున్న ఎఫ్‌అండ్‌ఓ ట్రెండ్స్‌!

Saturday 8th February 2020

నిఫ్టీ శుక్రవారం పరుగు కొనసాగించలేక వెనుకంజ వేసింది. రోజంతా 50 పాయింట్ల రేంజ్‌లో కదలాడి చివరకు 12100 పాయింట్ల దిగువన క్లోజయింది. వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ బుల్లిష్‌గా కనిపిస్తోంది. నిఫ్టీకి క్రమంగా మద్దతు స్థాయిలు పైవైపునకు పెరుగుతున్నాయి. నిఫ్టీ 12050 పాయింట్లను కాపాడుకున్నంత వరకు 12200- 12250 పాయింట్లను తాకేందుకే ఎక్కువ ఛాన్సులుంటాయి. ఇదే విషయాన్ని ఎఫ్‌అండ్‌ఓ గణాంకాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆప్షన్స్‌ డేటా చూస్తే నిప్టీ పుట్‌

Most from this category