ఆర్కామ్ డైరెక్టర్గా అనిల్ అంబానీ రాజీనామా
By D Sayee Pramodh

రిలయన్స్ కమ్యూనికేషన్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. తనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు చయ్యా విరాని, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్లు కూడా వైదొలిగారని కంపెనీ స్టాక్ ఎక్చేంజ్లకు సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఈ సమయంలో అనిల్ బోర్డు నుంచి వైదొలగడం గమనార్హం. వీరితో పాటు సీఎఫ్ఓ మనికంఠన్ కూడా తన రాజీనామాను సమర్పించారు. ఈ రాజీనామాలన్నీ కంపెనీ క్రెడిటర్స్ కమిటీ ముందుంచడం జరుగుతుందని ఆర్కామ్ వెల్లడించింది. క్యు2లో కంపెనీ రూ. 30142 కోట్ల నష్టాలు ప్రకటించింది. కార్పొరేట్ చరిత్రలో వొడాఫోన్ ఐడియా తర్వాత ఇంత అధ్వాన్న నష్టాలు ప్రకటించిన కంపెనీ ఆర్కామ్. నియంత్రణా నిబంధనలు, పెనాల్టీలు, ఫీజులు కలిసి టెలికం రంగంలో కంపెనీల నడ్డి విరుస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఏజీఆర్పై ఇచ్చిన తీర్పుతో 15 టెల్కోలపై రూ. 1.3 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.
You may be interested
ఎకానమీ ఇప్పట్లో కోలుకోదా..? మార్కెట్ల పరిస్థితి?
Sunday 17th November 2019హోల్సేల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గడంతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు అధిగమయ్యాయి. ఆర్థిక రికవరీ తక్షణమే ఉండొచ్చనేదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తోసిపుచ్చారు. ఆర్థిక మందగమనం, ఆర్బీఐ రేట్ల కోతపై ఆశలు సన్నగిల్లడంతో స్టాక్ మార్కెట్లు గతవారం ఫ్లాట్గా ముగిశాయి. మరి ఈ సమయంలో విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు ఏమంటున్నారో వారి ట్వీట్లను గమనిస్తే తెలుస్తుంది. ఈ సమయంలో టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలను ఖాతాల్లో చూపించాయి. ప్రభుత్వం పెద్ద ఉపశమనం
రాబోయే 3వారాలకు 3 స్టాక్ సిఫార్సులు
Saturday 16th November 2019సాంకేతిక అంశాలను పరిశీలిస్తే రానున్న 3వారాల్లో జస్ట్ డయల్, ఇండిగో షేర్లు స్థిరమైన రాబడుల్ని ఇవ్వచ్చని ఇండియానిశీష్ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు ముహుల్ కొఠారి అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే కాలవ్యవధితో జీ ఎంటర్టైన్ షేరును విక్రయించమని ఆయన సలహానిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 షేర్లపై కొఠారి విశ్లేషణలను చూద్దాం. షేరు పేరు:- జస్ట్ డయల్ టార్గెట్ ధర:- రూ.560లు స్టాప్ లాస్:- రూ.480లు అప్సైడ్:- 8-9శాతం కాల పరిమితి:- 1 నుంచి 3వారాలు విశ్లేషణ:- జస్ట్ డయల్ షేరు జూన్