News


స్వీయ తప్పిదాలే అనిల్‌ అంబాని కొంప ముంచాయా?!

Wednesday 19th June 2019
news_main1560917854.png-26397

కొన్నేళ్ల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరవ స్థానం‍లో నిలిచిన అనిల్‌ అంబాని ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 2008లో 4200 కోట్లడాలర్లున్న అనీల్‌ సంపద, మంగళవారం క్లోజింగ్‌ అనంతరం వంద కోట్ల డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 77.30 కోట్ల డాలర్లుంటుందని అంచనా. విచ్చలవిడిగా రుణాలను సేకరించడం, లాభదాయకం కాని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడంతో ఆయన తీవ్ర నష్టాలను చూశారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ను విస్తరించడానికి అధిక రుణాలను సేకరించి సరియైన సమయంలో బయటకి రాలేకపోవడంతో దీని ప్రబావం గ్రూప్‌లోని ఇతర కంపెనీలపై పడింది.  90శాతం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ నష్టపోడానికి ఇదే కారణం. గ్రూప్‌లో చాలా వరకు ప్రమోటర్లుగా లెండర్సే ఉండడం గమనార్హం. గ్రూప్‌లోని ఇతర కంపెనీలు కూడా అధిక రుణాలను సేకరించి తక్కువ మార్జిన్‌లున్న వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడంతో అడాగ్‌ షేర్లు తీవ్రంగా నష్టాపోయాయి. సరియైన విధివిదానాలు లేని వ్యాపారాలు, మానెజ్‌మెంట్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి షేర్‌హోల్డర్లకు అసౌకర్యన్ని కలిగించాయి.
నష్టాలను ఆపలేక పోతున్న​ అనిల్‌ అంబాని..
  నాలుగు నెలల వ్యవధిలో రూ.8,000 కోట్లున్న అడాగ్‌ మార్కెట్‌ క్యాపిటల్‌  రూ.6,196కోట్లకు పడిపోయింది.  రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్ హోం ఫైనాన్స్‌లలో మోసపూరిత లావాదేవిలు జరుగుతున్నాయని ఆడిటింగ్‌ సేవలందించే ప్రైస్‌ వాటర్‌ హౌజ్‌(పీడబ్యూసీ) కంపెనీ నుంచి  బయటికి రావడంతో అడాగ్‌ షేర్లు మరింత నష్టపోయాయి. గత 14 నెలల కాలంలో రూ.35,000కోట్ల రుణాలను తీర్చామని, మిగిలిన అప్పులను కూడా భవిష్యత్‌లో తీరుస్తామని అనిల్‌ అంబాని చెబుతున్నప్పటికి నష్టపోతున్న షేర్లు ఆగలేదు.  పేరుకు పోయిన రుణాల వలన గత ఐదు సంవత్సరాల్లో అనిల్‌ అంబాని సంపద క్షీణిస్తూ వచ్చింది. అడాగ్‌ షేర్లు తిరిగి కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో  ఈ కంపెనీలలో ఇన్వెస్టమెంట్‌లు తగ్గిపోయాయి. మంగళవారం కూడా అడాగ్‌ షేర్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఆర్‌ ఇన్‌ఫ్రా  9.29శాతం నష్టపోయింది. రిలయన్స్‌ నావల్‌, ఇంజనీరింగ్‌ 8.51శాతం, ఆర్‌ హోం ఫైనాన్స్‌ 7.55శాతం, ఆర్‌ కమ్యూనికేషన్స్‌ 5శాతం, ఆర్‌ పవర్‌ 4.91శాతం, ఆర్‌ క్యాపిటల్‌ 4.27 శాతం నష్టపోయాయి. రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఎసెట్‌ మానెజ్‌మెంట్‌(ఆర్‌ఎన్‌ఎల్‌ఏఎమ్‌) లోని 42.88 శాతం వాటాను విక్రయించడం కూడా వీటి పతనానికి కారణం.  ‍వీలున్నంత తొందరగా ఆస్థులను లిక్విడిటి కింద మార్చగలిగితే  పవర్‌, యుటిలిటిస్‌, ఆర్‌ క్యాప్‌ వ్యాపారాలు లాభాదాయకంగా పనిచేసే అవకాశం ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగాలలో షార్ట్‌ టెర్మ్‌ లిక్విడిటిని ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో అందించగలిగితే ఈ గ్రూప్‌ కోలుకోడానికి ఉపయోగపడుతుంది. You may be interested

కొనసాగుతున్న చమురు ధరల పెరుగుదల..

Wednesday 19th June 2019

గత సెషన్‌లో కనిపించిన చమురు ధరల పెరుగుదల బుధవారం ట్రేడింగ్‌లో కూడా కొనసాగుతుంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.6శాతం పెరిగి బ్యారెల్‌ 62.48డాలర్ల వద్ద, డబ్యుడీఐ క్రూడ్‌ 0.8శాతం పెరిగి బ్యారెల్‌ 54.34డాలర్ల వద్ద  ట్రేడవుతున్నాయి. ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో చెలరేగిన ఒత్తిడి కొనసాగుతుండడం, యూఎస్‌ -చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతాయనే నేపథ్యంలో బుధవారం చమురు ధరలు పెరిగాయి. జపాన్‌

14 పైసలు బలపడిన రూపీ

Wednesday 19th June 2019

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం 14పైసలు బలపడి 69.56 వద్ధ ప్రారంభమైం‍ది.  గత మూడు రోజుల నుంచి నష్టపోతున్న రూపీ మంగళవారం 21పైసలు బలపడి 69.70 వద్ద ముగిసింది. తగ్గిన చమురు ధరలు, డాలర్‌ బలహీనంగా ఉండడంతో డాలర్‌ మారకంలో రూపీ బలపడుతోంది.  ఫెడరల్‌ బ్యాం‍క్‌ పాలసీ ప్రకటన ఈ రోజు వెలువడనున్న  నేపథ్యంలో డాలర్‌ ఒత్తిడికి గురికావచ్చు.  ఫెడరల్‌ ఓపినింగ్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎమ్‌సీ) ప్రకటన ముందు మదుపర్లు జాగ్రత్తను

Most from this category