News


అనిల్ అంబానీ కేసులో చైనా బ్యాంకులకు చుక్కెదురు

Tuesday 17th December 2019
news_main1576556203.png-30267

  • 680 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌కు బ్రిటన్ హైకోర్టు నో

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) తీసుకున్న 680 మిలియన్ డాలర్ల కార్పొరేట్ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్ దరఖాస్తును బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి చేయజాలవని అంబానీ చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్ 7న దీనిపై విచారణ జరిగిందని, సోమవారం ఉత్తర్వులు వచ్చాయని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి తెలిపారు. 



You may be interested

ఐటీ షేర్లు ఆకర్షణీయం!

Tuesday 17th December 2019

నిపుణుల సూచన కొత్త ఏడాది ఐటీ షేర్ల హవా కొనసాగుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ రంగంలో క్రమంగా రిస్కులు దిగివస్తున్నాయని తెలిపారు. ఈ షేర్ల సరాసరి డివిడెండ్‌ ఈల్డ్‌ బాగుండడం, సాధారణ సేవింగ్స్‌ డిపాజిట్స్‌ కన్నా అధికంగా ఉండడంతో వీటిపై ఇన్వెస్టర్లకు మక్కువ పెరుగుతోంది. బలమైన డివిడెండ్‌ ఈల్డ్‌తో పాటు వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడం కూడా వీటిలో కొనుగోళ్లకు కారణమవుతోంది. ఈ రంగం నుంచి ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎల్‌అండ్‌టీ

మరో విడత రేటు కోతకు చాన్స్‌!

Tuesday 17th December 2019

ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ సంకేతాలు మందగమనాన్ని పసిగట్టే రేట్లు తగ్గిస్తూ వచ్చామని వెల్లడి వేచిచూసే ధోరణే డిసెంబర్లో పెంచకపోవటానికి కారణం ఎన్‌పీఏల సమస్య పరిష్కారమవుతుందని స్పష్టీకరణ ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మరో విడత రెపో రేటు తగ్గిస్తామనే సంకేతాలిచ్చారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.15 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని ఆర్‌బీఐ 2019 ఫిబ్రవరిలోనే గుర్తించిందని,

Most from this category