News


ఆంధ్ర సిమెంట్స్ నికర నష్టం రూ.36.94 కోట్లు

Wednesday 31st July 2019
news_main1564555912.png-27441

న్యూఢిల్లీ: ఆంధ్ర సిమెంట్స్ నికర నష్టం ఏడాది ప్రాతిపదికన మరింత పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.36.94 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది క్యూ1లో కంపెనీ నికర నష్టం రూ.31.34 కోట్లు. ఇక అంతక్రితం ఏడాదిలో రూ.93.24 కోట్లుగా ఉన్న ఆదాయం.. తాజా క్వార్టర్‌లో 55.80 శాతం క్షీణించి రూ.41.21 కోట్లుగా నమోదైంది. మొత్తం వ్యయం 37.23 శాతం తగ్గింది. రూ.124.74 కోట్ల నుంచి రూ.78.29 కోట్లకు తగ్గింది.



You may be interested

కాఫీ డే రేటింగ్‌పై నెగిటివ్‌ ప్రభావం : ఇక్రా

Wednesday 31st July 2019

తాజా పరిణామాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ రేటింగ్‌ నెగిటివ్‌గా మారవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా హెచ్చరించింది.‘ తాజా పరిణామాలతో (వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణం) కంపెనీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం వున్నందున, ఈ కంపెనీ రేటింగ్‌ను గమనిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే పరిణామాలు (సిద్ధార్థ మృతి...తదనంతర పరిస్థితులు) ప్రారంభ దశలో ఉండడంతో ఇంకా రేటింగ్‌కు తగ్గించే విషయంలో  ఒక నిర్ధారణకు రాలేదు’ అని ఇక్రా తెలిపింది.

హీరో మోటార్స్ లాభం 36 శాతం అప్‌

Wednesday 31st July 2019

క్యూ1లో రూ. 1,257 కోట్లు న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 925 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. జాతీయ విపత్తు సహాయక నిధి కోసం గతంలో కేటాయించిన రూ. 737 కోట్లు రీఫండ్ కావడం.. తాజాగా లాభాల

Most from this category