News


విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

Saturday 14th September 2019
news_main1568435860.png-28367

  • ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌ 

హైదరాబాద్‌: యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్‌ వెల్లడించింది. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌  కూడా ఆమోదం తెలిపింది. 



You may be interested

జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

Saturday 14th September 2019

ఈ నెల 16 నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వీడియో కంటెంట్‌ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 16 నుంచి వీడియో స్ట్రీమింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో యాప్‌లో వీడియోస్‌ అనే ట్యాబ్‌ నుంచి వీటిని చూడొచ్చని తెలిపింది. 18 ఒరిజినల్‌ షోలను వచ్చే మూడు నెలల కాలంలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. షోలు అన్నీ కూడా ఆహారానికి సంబంధించినవేనని స్పష్టం చేసింది. 3-15 నిమిషాల

రూపే కార్డులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు తగ్గింపు

Saturday 14th September 2019

ముంబై: రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును క్రమద్ధీకరించినట్టు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. అక్టోబర్‌ 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌), ఈకామ్‌, భారత్‌క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మర్చంట్‌ లావాదేవీలపై రేట్లను క్రమబద్ధీకరించినట్టు వివరించింది. రూ.2,000కు పైన ఉండే లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ చార్జీని 0.60 శాతానికి సవరించామని, గరిష్టంగా రూ.150గానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2,000పైన లావాదేవీలపై

Most from this category