News


తిరిగి లాభాల్లోకి ఆంధ్రాబ్యాంకు

Saturday 3rd August 2019
news_main1564807048.png-27511

బ్యాంకింగ్‌ రంగ సం‍స్థ ఆంధ్రాబ్యాంకు జూన్‌ త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో లాభాలను ప్రకటించింది. ఈ కాలంలో రూ.51.56 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు రూ.540 కోట్ల నష్టం వాటిల్లింది. మార్చి త్రైమాసికంలో రూ.1,233 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవరు రూ.5,092 కోట్ల నుంచి రూ.5,437 కోట్లకు ఎగసింది. స్థూల నిరర్ధక ఆస్తులు 16.69 నుంచి 16.44 శాతానికి వచ్చి చేరాయి. మార్చిలో ఇది 16.21 శాతం ఉండడం గమనార్హం. ఇక నికర ఎన్‌పీఏలు 7.96 నుంచి 5.67 శాతానికి వచ్చాయి. మార్చి క్వార్టరులో ఇది 5.73 శాతముంది. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ.1,388 కోట్ల నుంచి రూ.923 కోట్లకు వచ్చి చేరాయి. కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో ఆంధ్రాబ్యాంకు రూ.39.5 కోట్ల నికరలాభం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.537 కోట్ల నష్టం నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.5,315 కోట్ల నుంచి రూ.5,724 కోట్లకు చేరింది. 2018-19లో నాలుగు త్రైమాసికాల్లో నష్టాలను చవిచూసింది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుకు రూ.2,786 కోట్ల నష్టం వాటిల్లింది.



You may be interested

ఏడో ర్యాంకుకు పడిపోయిన భారత్‌

Saturday 3rd August 2019

ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల విడుదల భారత్‌ కంటే ముందుకెళ్లిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ 2017లో ఆరో స్థానం న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్‌ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్‌ డాలర్ల పరిమాణంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్‌ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్‌ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్‌ డాలర్లు), జపాన్‌ (4.9 ట్రిలియన్‌

గోల్డ్‌ బాండ్‌ ధర గ్రాముకు రూ.3,499

Saturday 3rd August 2019

న్యూఢిల్లీ: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ 2019-2020 (సిరీస్‌ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమవుతుంది. ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్‌ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50

Most from this category