News


ఎస్‌బీఐపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 31st October 2019
news_main1572496103.png-29253

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఎస్‌బీఐ షేరుపై పలు బ్రోకరేజ్‌లు పాజిటివ్‌ ధృక్పధాన్ని వెలిబుచ్చుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరకు బ్యాంకు స్లిపేజ్‌లు కట్డడి చెందుతాయని అంచనా వేస్తున్నాయి. 
సీఎల్‌ఎస్‌ఏ: అధిక రేట్లు ఆఫర్‌ చేయకుండానే బ్యాంకు మార్కెట్‌వాటా కొల్లగొడుతోంది. డిజిటల్‌ ప్లా్‌ట్‌ఫామ్స్‌ ఇతర బ్యాంకులతో పోలిస్తే ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బ్యాంకు ఎర్నింగ్స్‌ రికవరీ ఆరంభమవుతుంది. సేవింగ్స్‌ డిపాజిట్స్‌ వృద్ధి 7 శాతానికి చేరడం విశేషం. పీఎస్‌యూ బ్యాంకుల్లో ఎస్‌బీఐని టాప్‌పిక్‌గా పేర్కొంది.  కొనొచ్చు రేటింగ్‌ ఇస్తూ టార్గెట్‌ రూ. 390కి పెంచింది. టెలికం రంగానికి ఎంత రుణాలిచ్చిందనేది ఒక్కటే రిస్కీ అంశమని తెలిపింది.  
ఎమ్‌కే గ్లోబల్‌: తమ ఆల్ఫా పోర్టుఫోలియోల ఎస్‌బీఐని చేర్చుకుంది. విస్తృతమైన నెట్‌వర్క్‌, బలమైన డిజిటైజేషన్‌, బలమైన మూలధనం మరియు అనుబంధ సంస్థలు మంచి విలువ పలకడం వంటివి బ్యాంకును టాప్‌లో నిలుపుతున్నాయని తెలిపింది. ఆర్‌ఓఏ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతానికి చేరవచ్చు. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓతో మరింత విలువ బహిర్గతం కానుందని తెలిపింది. కొనొచ్చు రేటింగ్‌తో రూ. 350 టార్గెట్‌ను ఇచ్చింది. 
ప్రభుదాస్‌ లీలాధర్‌: అల్పవడ్డీలకారణంగా ఎన్‌ఐఎంలో మెరుగుదల, ఫీజు ఆదాయంలో స్థిర వృద్ధి, నిర్వహణ వ్యయాలను  10 శాతం లోపు కట్టడి చేయడం, క్రెడిట్‌వ్యయాలు 100 బీపీఎస్‌ కన్నా తక్కువకు చేరడం వంటి కారణాలు భవిష్యత్‌లో బ్యాంకును మరింత ముందుకు తీసుకుపోతాయని తెలిపింది. ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకు లాభం క్రమంగా 6,575వేల కోట్ల రూపాయలకు(ప్రొవిజన్ల కేటాయింపునకు ముందు) చేరవచ్చని అంచనా వేసింది. షేరుపై కొనొచ్చు రేటింగ్‌ ఇస్తూ రూ. 413కు టార్గెట్‌ను పెంచింది. You may be interested

11884 దాటితే 11981 పాయింట్ల వరకు నిఫ్టీ!

Thursday 31st October 2019

నిపుణుల అంచనా నిఫ్టీ చార్టుల్లో హ్యాంగింగ్‌ మ్యాన్‌ తరహా క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది టాప్‌ అవుట్‌కు సంకేతంగా కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే గురువారం ముగింపును బట్టి ఈ విషయం నిర్ధారణ చేసుకోవాల్సిఉంటుంది. ప్రస్తుతానికి నిఫ్టీ 11700 పాయింట్ల పైన ఉన్నంత వరకు బుల్స్‌ హవానే ఉండొచ్చు. ఒకవేళ కొంత వెనకడుగు వేసినా, ఈ స్థాయి పైన ఉన్నంత వరకు తిరిగి బుల్స్‌ పగ్గాలు అందుకోగలరని నిపుణుల అంచనా. తాజా ర్యాలీ

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 31st October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ‍ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  బంధన్‌ బ్యాంక్‌:- విలీన పథకంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ బ్యాంక్‌ 9.89శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీకి 15.93 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసినట్లు బ్యాంకు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. వోడాఫోన్‌ ఐడియా:- 14 బిలియన్‌ డాలర్ల నికర రుణం, పెరుగుతున్న నష్టాలు, క్షీణిస్తున్న చందదారులు లాంటి సమస్యల పరిష్కారానికి రుణదాతులతో సమావేశం జరుపుతునట్లు తెలుస్తోంది.  జీ లిమిటెడ్‌:- సంస్థలలో

Most from this category