News


అమూల్‌ చేతికి హెరిటేజ్‌ పంజాబ్‌ ప్లాంటు

Saturday 29th February 2020
news_main1582959930.png-32186

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డెయిరీ రంగంలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్‌.. పంజాబ్‌లోని తన ప్లాంటును అమూల్‌కు విక్రయించనుంది. డీల్‌ విలువ రూ.21.2 కోట్లు. వారం రోజుల్లో అమూల్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకోనుంది. అమూల్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌కు (జీసీఎంఎంఎఫ్‌) చెందిన కైరా డిస్ట్రిక్ట్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌కు ప్లాంటును విక్రయిస్తోంది. ప్లాంటు ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌కు 2017-18లో రూ.33.82 కోట్ల టర్నోవర్‌పై రూ.75 లక్షల నష్టం, 2018-19లో రూ.46.63 కోట్ల టర్నోవర్‌పై రూ.13 లక్షల నష్టం వాటిల్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో రూ.40 కోట్ల టర్నోవర్‌పై రూ.5 కోట్ల నష్టం మూటగట్టుకుంది. ప్లాంటు నెట్‌వర్త్‌ రూ.21.10 కోట్లు అని కంపెనీ తెలిపింది. 



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ.2,769 కోట్ల సమీకరణ

Saturday 29th February 2020

ముంబై:- ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సంస్థ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,769 కోట్లను సమీకరించినట్లు తెలిపింది. ఐపీఓ ఒకరోజు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్లకు మొత్తం 3.66 కోట్ల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.1,480ల వద్ద కేటాయించి ఈ మొత్తాన్ని సమీకరించినట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ సంస్థ వెల్లడించింది. సింగపూర్‌ గవర్నమెంట్‌, మానిటరీ ఆథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌, బిర్లా గ్రూప్‌లతో

భద్రమైన బంగారం ఎందుకు పడిపోయింది?

Saturday 29th February 2020

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ మార్కెట్‌లన్నీ కుప్పకూలినప్పటికీ, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో బంగారం ధర పడిపోయింది. అయితే ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే బంగారం ధరలు కూడా దిగిరావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం ఒక్కరోజే  3 శాతంపైన బంగారం ధర పడిపోయింది.అమెరికా మార్కెట్‌లో 2008లో ఒక వారంలో ఆయిల్‌ ధరలు పడిపోయినట్లుగా ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్నాయి. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 57.50 (3.5%)డాలర్లు పడిపోయి

Most from this category