News


రెడీ టు కుక్‌ విభాగంలో ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌

Saturday 17th August 2019
news_main1566019067.png-27829

  • కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో ప్లాంటు
  • మంగమ్మ ఫుడ్స్‌ కో-ఫౌండర్‌ విశ్వనాథ్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెడీ టు కుక్‌ ఫుడ్‌ విభాగంలోకి హైదరాబాద్‌కు చెందిన మంగమ్మ ఫుడ్స్‌ ప్రవేశించింది. ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌ పేరుతో చపాతీ, పూరీ, పరోటా శ్రేణిలో పలు రుచులను పరిచయం చేసింది. తమ ఉత్పత్తులకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ధ్రువీకరణ ఉందని మంగమ్మ ఫుడ్స్‌ కో-ఫౌండర్‌ నాగసాయి విశ్వనాథ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రొడక్టులు ఏడు రోజులపాటు మన్నికగా ఉంటాయని వివరించారు. మైసూరులోని  సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలాజికల్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో రెడీ టు కుక్‌ ప్రొడక్టుల ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటికే టెస్ట్‌ మార్కెట్లో 30,000 పైగా కుటుంబాలకు చేరువయ్యామని చెప్పారు. ఔత్సాహికులు ఎవరైనా రూ.2,500ల పెట్టుబడితో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయం చేపట్టవచ్చని వివరించారు.
రోజుకు లక్ష యూనిట్లు..
మంగమ్మ ఫుడ్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. రోజుకు 40,000 యూనిట్లు తయారు చేయగల సామర్థ్యం ఉందని కో-ఫౌండర్‌ ప్రతిమ విశ్వనాథ్‌ వెల్లడించారు. ‘2020 మార్చికల్లా దీనిని ఒక లక్ష యూనిట్ల స్థాయికి తీసుకు వెళతాం. జనవరి నాటికి రెడీ టు కుక్‌ కర్రీస్‌, రెడీ టు ఈట్‌ స్నాక్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తాం. ప్రస్తుతం విక్రయిస్తున్న ప్యాక్‌ల ఖరీదు రకాన్నిబట్టి రూ.45-70 మధ్య ఉంది. ఒక్కో ప్యాక్‌లో 10 యూనిట్లుంటాయి’ అని వివరించారు. కాగా, నాగసాయి విశ్వనాథ్‌కు రిటైల్‌ రంగంలో అపార అనుభవం ఉంది. కోకకోలా, సాబ్‌ మిల్లర్‌, మారికో ఇండస్ట్రీస్‌, పార్లే బిస్కట్స్‌ వంటి సంస్థల్లో కీలక హోదాలో పనిచేశారు. ఆఫ్రికాలోని ఘనాలో గ్లోబకామ్‌ టెలికం కంపెనీ బిజినెస్‌ హెడ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. You may be interested

నిఫ్టీ 11350 స్థాయిని అందుకునే అవకాశం

Saturday 17th August 2019

‘మార్కెట్లు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్‌లను కొనసాగించడానికి, కొత్తగా లాంగ్‌ పొజిషన్‌లను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు’ అని సామ్కో సెక్యురిటీష్‌, రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అన్నారు. ఈ వారం మొత్తంగా గమనిస్తే మార్కెట్‌లు నెగిటివ్‌లో ముగిశాయని, షార్ట్‌ కవరింగ్‌ జరిగితే నిఫ్టీ తిరిగి 11,350 స్థాయిని అందుకోగలదని తెలిపారు. ‘అంతర్జాతీయంగా ఎటువంటి నెగిటివ్‌ సంకేతాలు లేకపోతే అగష్టులో 10,780 ఒక మంచి మద్ధతు స్థాయి కాగలదు’ అని

ఇక 70-72 మధ్య రూపాయి

Saturday 17th August 2019

శుక్రవారం 13 పైసలు లాభం 71.14 వద్ద ముగింపు ముంబై: రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం 13 పైసలు లాభపడి 71.14 వద్ద ముగిసింది. అయితే ఇది షార్ట్‌కవరింగ్‌గా భావించడం జరుగుతోందని, రూపాయి రానున్న పక్షం రోజుల్లో మరింత బలహీనపడే అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా. సమీపకాలంలో 70-72 శ్రేణిలో తిరిగే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రూపాయి శుక్రవారం బలహీన

Most from this category