News


అంబుజా సిమెంట్స్‌ లాభం రూ.534 కోట్లు

Saturday 19th October 2019
news_main1571458848.png-28995

  • 45 శాతం వృద్ధి 
  • రూ.6,190 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: అంబుజా సిమెం‍ట్స్‌ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగిసిన క్వార్టర్‌కు రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే ‍క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.396 కోట్లుతో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని అంబుజా సిమెంట్స్‌ తెలిపింది. రవాణా వ్యయాలు తగ్గడం, ప్రీమియమ్‌ ఉత్పత్తుల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని అంబుజా సిమెంట్స్‌ ఎమ్‌డీ, సీఈఓ బిమలేంద్ర ఝా చెప్పారు. ఈ కంపెనీ జనవరి-డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. మొత్తం ఆదాయం రూ.6,098 కోట్ల నుంచి 1.5 శాతం వృద్ధితో రూ.6,190 కోట్లకు పెరిగిందని బిమలేంద్ర పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.5,537 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.5,401 కోట్లకు చేరాయని వివరించారు. 
సిమెంట్‌కు జోరుగా డిమాండ్‌ ...! 
కంపెనీ అమ్మకాలు 5.46 మిలియన్‌ టన్నుల నుంచి 4 శాతం తగ్గి 5.23 మిలియన్‌ టన్నులకు చేరాయని బిమలేంద్ర ఝా తెలిపారు. వంద శాతం అనుంబంధ సంస్థ, డిర్క్‌ ఇండియాను విలీనం చేసుకోవడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు, ఇతర సానుకూల చర్యలు, వడ్డీరేట్ల తగ్గింపు కారణంగా సిమెంట్‌కు జోరుగా డిమాండ్‌ పెరగగలదని అంచనా వేస్తున్నామన్నారు. 



You may be interested

మారుతీ ఈకో శ్రేణి ధరల పెంపు

Saturday 19th October 2019

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తన ఈకో శ్రేణి కార్ల ధరలను పెంచింది. తాజా క్రాష్ నిబంధనలకు అనుగుణంగా మోడల్‌ను అభివృద్ధి పరిచిన కారణంగా ధర పెరిగినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన ధరల శ్రేణి రూ. 3.61 లక్షల నుంచి రూ. 6.61 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు రెగ్యులేటరీలకు అందించిన సమాచారంలో పేర్కొంది. 

ఏటా అయిదు కొత్త ఉత్పత్తులు

Saturday 19th October 2019

ఐఐఎల్‌ ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- అగ్రోకెమికల్స్‌ కంపెనీ ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా (ఐఐఎల్‌) ఏటా అయిదు కొత్త ఉత్పాదనలను తేనుంది. ప్రస్తుతం కంపెనీ 18 రకాల ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోంది. వీటికి మూడు నాలుగు ఉత్పత్తులు ఈ ఏడాది జతకూడనున్నాయని ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా ఎండీ రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. మిరపను నాశనం చేసే పురుగులను హరించే కునోయిచిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గతేడాది నూతన తరం

Most from this category