News


ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు వాటాలు

Saturday 24th August 2019
news_main1566622742.png-27986

  • 49 శాతం కొనుగోలుకు ఒప్పందం
  • పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.58 శాతం వాటాలు

న్యూఢిల్లీ: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా పరోక్షంగా ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కూడా వాటాలు దక్కించుకోనుంది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 7.3 శాతం వాటాలు ఉన్నాయి. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు 3.58 శాతం వాటాలు దక్కనున్నాయి. దేశీయంగా సుమారు 400 పైగా నగరాల్లో బిగ్‌ బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే క్లబ్‌ వంటి 2,000 పైచిలుకు స్టోర్స్‌ను ఫ్యూచర్ రిటైల్ నిర్వహిస్తోంది. ఒప్పందం విలువ వెల్లడించడానికి ఫ్యూచర్‌ రిటైల్‌ నిరాకరించింది. అయితే, మరిన్ని కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడానికి, డిజిటల్ పేమెంట్‌ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తేవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడగలదని సంస్థ పేర్కొంది. భారత కస్టమర్లకు అత్యుత్తమ షాపింగ్ అనుభూతి కల్పించే విషయంలో తమ నిబద్ధతకు ఈ పెట్టుబడులు నిదర్శనమని వివరించింది. అంతర్జాతీయంగా డిజిటల్ పేమెంట్స్ ట్రెండ్స్‌ గురించి తెలుసుకునేందుకు, కొత్త సాధనాలు ప్రవేశపెట్టేందుకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా తమకు అవకాశం దక్కగలదని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫ్యూచర్‌ గ్రూప్‌లో అమెజాన్‌ సుమారు 10 శాతం వాటాల కొనుగోలు చర్చల్లో ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది.  ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ప్రమోటర్లకు ఉన్న వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అవకాశం ఉంటుంది. 2019 జూన్ ఆఖరు నాటికి ప్రమోటరు గ్రూప్‌నకు ఎఫ్‌ఆర్‌ఎల్‌లో 47.02 శాతం వాటాలు ఉన్నాయి. 

1.2 లక్షల కోట్ల మార్కెట్‌..
ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా భారత మార్కెట్ ఎదుగుతోంది. 2021 నాటికల్లా ఇది 1.2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా, రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2017లో దేశీ మార్కెట్‌  విలువ 795 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ ప్రతిపాదిత ఈ-కామర్స్‌ వెంచర్‌తో అమెజాన్‌ భారత మార్కెట్లో పోటీపడాల్సి వస్తోంది. అందుకే ఇటు ఆన్‌లైన్‌, అటు ఆఫ్‌లైన్‌ విభాగాల్లో కార్యకలాపాలు మరింతగా విస్తరించుకుంటూ స్థానం పటిష్టం చేసుకుంటోంది. ఇప్పటికే కే రహేజా కార్పొరేషన్‌ గ్రూప్‌నకు చెందిన షాపర్స్‌ స్టాప్‌, ఆదిత్య బిర్లా రిటైల్‌కు చెందిన మోర్ సూపర్‌మార్కెట్స్‌లో అమెజాన్ వాటాలు కొనుగోలు చేసింది. ఇది మూడో ఒప్పందం. ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌ విభాగంలో అమెజాన్‌ తన స్థానం మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ డీల్ దోహదపడనుంది. అమెజాన్‌ ఇప్పటికే భారత మార్కెట్‌పై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసరాల సరుకుల విభాగంపై 500 మిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. అమెజాన్ ఈ వారమే ప్రపంచంలోనే తమ క్యాంపస్‌లో అతి పెద్ద దాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. 15,000 మంది పైచిలుకు సిబ్బందికి ఇది సరిపోతుంది. You may be interested

ఇక నుంచి వెర్షన్‌ సంఖ్యతోనే ఆండ్రాయిడ్‌ ఓఎస్‌

Saturday 24th August 2019

లేటెస్ట్‌ వెర్షన్‌ పేరు 'ఆండ్రాయిడ్ 10' న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌లో విరివిగా వాడకంలో ఉన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్‌)కు ఇక నుంచి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల పేర్లు పెట్టకుండా.. సింపుల్‌గా వెర్షన్‌ నంబరుతో మాత్రమే విడుదల చేయాలని టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయించింది. వివిధ వెర్షన్లకు వివిధ రకాల పేర్లు కొనుగోలుదారుల్లో గందరగోళం రేపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ బ్లాగ్‌లో వెల్లడించింది. దీంతో కొత్తగా రాబోయే వెర్షన్‌ను కేవలం 'ఆండ్రాయిడ్ 10'గా

బంధన్‌ బ్యాంక్‌ నుంచి ‘కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’..!

Saturday 24th August 2019

స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో సేవలు కోల్‌కతా: ప్రైవేట్‌ రంగానికి చెందిన బంధన్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లకు ‘కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’లను జారీ చేయనుంది. ఈ సేవలను అందించడం కోసం తాజాగా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ చంద్రశేఖర్‌ ఘోష్‌ ప్రకటించారు. మూడు వేరియంట్లలో కార్డుల జారీ కానుండగా, క్రెడిట్‌ పిరియడ్‌ 52 రోజులుగా నిర్ణయించామని ఆయన వివరించారు. ఈ అంశంపై స్టాండర్డ్‌ చార్టర్‌

Most from this category