News


లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లోకి అమెజాన్‌!

Friday 31st January 2020
news_main1580447411.png-31365

గురువారం అద్భుత ఫలితాలు ప్రకటించడంతో ఆన్‌లైన్‌ ఈకామ్‌ దిగ్గజం అమెజాన్‌ షేరు ట్రేడింగ్‌ ఆఫ్టర్‌ అవర్స్‌లో దాదాపు 10 శాతం లాభంతో కదలాడుతోంది. దీంతో శుక్రవారం ఆరంభంలో షేరు 2050 డాలర్ల పైన ఆరంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈలెక్కన కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల డాలర్లను చేరనుంది.

గురువారం క్లోజింగ్‌ రేటు ప్రకారం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సుమారు 93000 కోట్ల డాలర్లుంది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సాధిస్తే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన కంపెనీల్లో ఆరో కంపెనీగా నిలుస్తుంది. ఇప్పటికే అరామ్‌కో, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, పెట్రోచైనా, ఆల్ఫాబెట్‌లు లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరాయి. ఈ ఘనత సాధిస్తే లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన నాలుగో యూఎస్‌ కంపెనీగా అమెజాన్‌ నిలుస్తుంది. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 21 శాతం పెరిగి 8740 కోట్ల డాలర్లను చేరింది. ఇది కంపెనీ గైడెన్స్‌ రేంజ్‌, అనలిస్టుల అంచనాల స్థాయిల కన్నా చాలా ఎక్కువ. కంపెనీ ఈపీఎస్‌ సైతం అంచనాలకన్నా అధికంగా షేరుకు 6.47 డాలర్లకు చేరింది. రాబోయే త్రైమాసికంలో సైతం ఆదాయ అంచనాలు బాగుంటాయని కంపెనీ తెలిపింది.

కంపెనీ డిసెంబర్‌ త్రైమాసికంలో అన్ని విభాగాల్లో ఆశించిన స్థాయిల కన్నా ఎక్కువ ఫలితాలనే నమోదు చేసింది. దీంతో కంపెనీ ఆఫ్టర్‌ అవర్స్‌లో ఒకదశలో దాదాపు 12.3 శాతం లాభపడి 2101 డాలర్లను తాకింది. ఈ ధరతో లెక్కిస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 1.05 లక్ష కోట్ల డాలర్లుంటుంది. అమెజాన్‌ ప్రభావంతో అమెరికా మార్కెట్‌ ఫ్యూచర్స్‌ సైతం పాజిటివ్‌గా ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ500లో కంపెనీకి 3 శాతం వెయిటేజ్‌ ఉంది. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Friday 31st January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు హెచ్‌ఏఎల్‌: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో 15 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాకు రూ.4,000 కోట్లను సమకూర్చవచ్చని కేం‍ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌: ఈ కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 23 శాతం పెరిగి రూ.798.7 కోట్లకు చేరింది. యస్‌బ్యాంక్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌: సికాల్‌ లాజిస్టిక్స్‌లోని 2.68 శాతం వాటా కలిగిన 15

ఎస్‌బీఐ క్యూ3 లాభం హైజంప్‌?

Friday 31st January 2020

నికర లాభం రూ. 5577 కోట్లు! నికర వడ్డీ ఆదాయం 19 శాతం అప్‌? బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు దేశీ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. నేడు ఎస్‌బీఐ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించనుంది. ఈ ఏడాది క్యూ3లో పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం 80 శాతం జంప్‌చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఎస్సార్‌ స్టీల్‌ రుణ పరిష్కారం(రిజల్యూషన్‌),

Most from this category