News


భారత్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడి

Wednesday 30th October 2019
news_main1572404831.png-29215

  • మార్కెట్‌ ప్లేస్‌, రిటైల్‌, అమెజాన్‌ పేలో 
  •  నూతనంగా రూ. 4,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్‌ కామ్ ఇంక్‌ సంస్థలు ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నాయి. రైట్స్‌ ఇష్యూ పద్దతిలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ  పూర్తికానున్నట్లు తెలుస్తోంది. ఏ విభాగంలో ఎంత పెట్టుబడి చేరుకోనుందనే విషయానికి వస్తే.. అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ (మార్కెట్ ప్లేస్ యూనిట్) రూ. 3,400 కోట్లు, అమెజాన్ పే ఇండియా రూ. 900 కోట్లు, అమెజాన్ రిటైల్ ఇండియా (ఫుడ్ రిటైల్ వ్యాపారం) రూ. 172.5 కోట్లను అందుకోనున్నాయి. వివిధ విభాగాల్లో 2018-19 కాలంలో రూ. 7,000 కోట్ల పెట్టుబడి పెట్టిన అమెజాన్‌.. ఫ్లిప్‌కార్ట్‌ వంటి కంపెనీలతో పెరిగిన పోటీ కారణంగా భారత్‌లో తన పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు ఈ రంగ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెట్టుబడికి సంబంధించి ఇక్కడి వ్యాపార విభాగాల నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినప్పటికీ.. 2016లో సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారత్‌లో పెట్టుబడులను 5 బిలియన్‌ డాలర్లకు పెంచుతామని ప్రకటన చేసిన ఆధారంగా పోటీలో నిలబడేందుకే నూతన పెట్టుబడులు చేరనున్నాయని విశ్లేషిస్తున్నాయి. You may be interested

టాప్‌ 10 గ్లోబల్‌ సీఈఓల్లో భారత సంతతి

Wednesday 30th October 2019

6వ స్థానంలో అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్ 7, 9 ర్యాంకుల్లో అజయ్ బంగా, సత్య నాదెళ్ల హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్‌బీఆర్) తాజా జాబితా వెల్లడి న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్‌బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్‌ సీఈఓ శంతను

ఈ బ్యాంకు స్టాక్స్‌లో బంపర్‌ లాభాలు

Wednesday 30th October 2019

రానున్న ఏడాది కాలంలో డీసీబీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాకు, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మంచి రాబడులకు అవకాశం ఉందన్నారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. పలు మార్కెట్‌ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.   మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో నెలకొన్న నిరాశావాదాన్ని గత 30 ఏళ్లలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో సిప్‌ రూపంలో

Most from this category