News


భారత్‌లో అమెజాన్‌ రూ. 1,700 కోట్ల పెట్టుబడులు

Wednesday 15th January 2020
news_main1579059819.png-30936

న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌..  చెల్లింపులు, హోల్‌సేల్‌ వ్యాపార విభాగాల్లోకి రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్‌ పే ఇండియా విభాగానికి అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్‌, అమెజాన్‌డాట్‌కామ్‌డాట్‌ఐఎన్‌సీఎస్‌ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్ హోల్‌సేల్ (ఇండియా) కూడా షేర్లు కేటాయించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది అక్టోబర్‌లోనే వివిధ విభాగాలపై అమెజాన్‌ రూ. 4,400 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. భారీ నష్టాలు చవిచూస్తున్నప్పటికీ .. కొత్తగా మరిన్ని పెట్టుబడులు పెడుతుండటమనేది భారత మార్కెట్‌పై అమెజాన్‌కున్న గట్టి నమ్మకాన్ని సూచిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 
    అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణకు కూడా ఆదేశించింది. ఇదే సమయంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈ వారం భారత పర్యటనకు రానున్నారు. పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వాధికారులతో సమావేశం కానున్నారు. అమెజాన్‌పై ఆరోపణల నేపథ్యంలో బెజోస్‌ పర్యటన సందర్భంగా వర్తకుల సమాఖ్య సీఏఐటీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th January 2020

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(15న) ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ప్రాథమిక్‌ డీల్‌ నేడు కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో జపాన్‌, చైనా, హాంకాంగ్‌ తదితరాలు 0.5 శాతంపైగా నీరసించి కదులుతున్నాయి. మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు చరిత్రాత్మ గరిష్టాల వద్ద నిలవడంతో నేడు దేశీ మార్కెట్లలో కొంతమేర

టోకు ద్రవ్యోల్బణానికి ఉల్లి సెగ

Wednesday 15th January 2020

(అప్‌డేటెడ్‌...) డిసెంబర్‌లో 2.59 శాతంగా నమోదు ఇది 8 నెలల గరిష్టం జనవరిలోనూ ధరల మంట తప్పదంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ: ఉల్లి, బంగాళదుంప తదితర కూరగాయల ధరలు భారీగా పెరగడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (ఽడబ్ల్యూపీఐ) ఎనిమిది నెలల గరిష్టానికి ఎగిసింది. 2.59 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్‌లో 3.46 శాతంగా నమోదైంది. 2019 ఏప్రిల్‌లో 3.24 శాతం తర్వాత మళ్లీ ఆ స్థాయి నమోదు

Most from this category